Movie News

HHVM : క్రిష్ వైదొలగడానికి కారణం ఇదే! సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ జ్యోతి కృష్ణ

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం “హరిహర వీరమల్లు” ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్ని సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ పరంగా సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు జ్యోతికృష్ణ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అంతేకాక, మొదట ఈ చిత్రాన్ని తెరకెక్కించాల్సిన క్రిష్ జాగర్లమూడి ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడానికి గల కారణాన్ని కూడా వివరించారు. మొదట్లో “హరిహర వీరమల్లు” చిత్రాన్ని ఒక కామెడీ సినిమా చేయాలన్న ఆలోచనతో మొదలుపెట్టామని ఆయన తెలిపారు.

This is the reason why Krish quit! Director Jyothi Krishna made sensational comments

‘మాయాబజార్’ స్టైల్ కామెడీ నుంచి యాక్షన్ డ్రామాగా మారిన ప్రస్థానం

జ్యోతికృష్ణ మాట్లాడుతూ – “నేను ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే ఉన్నాను. ఈ కథలో ముఖ్యాంశంగా ఉండే కోహినూర్ డైమండ్ నేపథ్యంలో సినిమా తయారు చేయాలని అనుకున్నాం. దర్శకుడు క్రిష్ దీన్ని మాయాబజార్ స్టైల్ కామెడీగా తీయాలనుకున్నారు. సినిమా పనులను కూడా అదే ఉద్దేశ్యంతో మొదలుపెట్టాం. మొదట ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాం. కానీ తీరా కరోనా వచ్చింది. మళ్లీ మేము మరో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తే.. అప్పటికే రెండో వేవ్ వచ్చేసింది. దానికి తోడు ఎన్నికలు జరిగిపోయాయి. దీంతో సినిమాకు పెద్ద విరామం వచ్చింది” అని వివరించారు.

క్రిష్ వైదొలగడానికి అసలు కారణం, జ్యోతికృష్ణ దర్శకత్వం

ఇక ఈ విరామం సమయంలో క్రిష్ తనకు ముందే ఒప్పుకున్న ఇతర ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాల్సి రావడంతో “హరిహర వీరమల్లు” నుంచి వైదొలిగినట్లు జ్యోతికృష్ణ తెలిపారు. ఆ తరువాత జ్యోతికృష్ణే ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. “నేను ఈ చిత్రాన్ని రెండు పార్ట్స్‌గా ప్లాన్ చేశాను. పవన్ గారికి ఈ విషయం వివరించగానే – ‘బాగుంది.. నువ్వే దర్శకత్వం తీసుకో’ అన్నారు. అప్పటి నుంచి నా జర్నీ మొదలైంది. మొదటి భాగం కథలో కొన్ని మార్పులు చేశాను. కోహినూర్ ప్రధానాంశం మాత్రం పార్ట్-2లో చూపించబోతున్నాం. కోహినూర్ కోసం ఏం జరిగిందనేది అక్కడ రివీల్ చేస్తాం” అని అన్నారు.

VFX పై వివరణ: “4-5 షాట్లు మాత్రమే నాసిరకం”

వీఎఫ్ఎక్స్ విషయానికొస్తే – “ఈ సినిమాలో మొత్తం 4,399 సీజీ షాట్లు వాడాం. వాటిలో 4-5 షాట్లు కొంచెం నాసిరకంగా వచ్చాయి. వాటిని కూడా మళ్లీ మార్చాం. సినిమాకు టెక్నికల్‌గా ఎంతో మేం కష్టపడాం” అని జ్యోతికృష్ణ స్పష్టం చేశారు.

పార్ట్ 2 పై ఆసక్తి

మొత్తంగా, ఈ చిత్రం ఒక యాక్షన్ పీరియాడికల్ డ్రామాగా మారిపోవడం, దాని వెనుక ఉన్న ప్రయాణం, వాస్తవాలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. Part 2లో కోహినూర్ కథలో ఇంకా ఏం ఉంటుందో చూడాల్సిందే.

telugudesk

Recent Posts

Cheating Wife : హోటల్ గదిలో భార్య, ప్రియుడు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసింది.. వీడియో వైరల్!

Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…

23 minutes ago

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…

51 minutes ago

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…

6 hours ago

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…

7 hours ago

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…

7 hours ago

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…

7 hours ago