Sampath Raj:అప్పటి వరకూ ఎన్నో తెలుగు తమిళ చిత్రాలలో నటించిన రాని గుర్తింపు కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమా ద్వారా గుర్తింపు వచ్చిందని నటుడు సంపత్ రాజ్ తెలిపారు.మిర్చి సినిమా ద్వారా విలన్ పాత్రలో అందరికీ సుపరిచితమైన సంపత్ రాజ్ అనంతరం ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో విలన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సంపత్ రాజ్ మాట్లాడుతూ… తన ఫ్యామిలీ గురించి తన కెరీర్ గురించి ఆశక్తికరమైన విషయాలు తెలిపారు. ఇక నటి శరణ్య సంపత్ రాజ్ భార్యాభర్తలు అంటూ ఒక వార్త ఇండస్ట్రీలో షికార్లు కొట్టింది.
ఈ కార్యక్రమం ద్వారా సంపత్ రాజ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరణ్య ఫ్యామిలీ,మా ఫ్యామిలీ చాలా క్లోజ్ అని, తన భర్త నేను మంచి ఫ్రెండ్స్ అనే విషయాన్ని తెలిపారు. అయితే మేమిద్దరం కలిసి ఒక సినిమాలో భార్యాభర్తలుగా నటించామని అదే విషయాన్ని కొందరు మేము భార్య భర్తలనీ రాశారని ఈ సందర్భంగా వారి గురించి వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఒక దర్శకుడికి వార్నింగ్ ఇచ్చారట కదా.. సినిమాలో అవకాశం ఇవ్వకపోతే కెమెరాలు ఎత్తుకెళ్లి పోతానని వార్నింగ్ ఇచ్చారని అలీ అడగడంతో అందుకు సంపత్ సమాధానం చెబుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా చేయబోతున్నారు ఈ క్రమంలోనే అందులో నాకు ఛాన్స్ ఇవ్వకపోతే కెమెరాలన్ని ఎత్తుకెళ్లి పోతా అంటూ తనకు సరదాగా స్వీట్ వార్నింగ్ ఇచ్చానని ఈ సందర్భంగా తెలిపారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…