Uma Maheswari : ఉమా మహేశ్వరి మరణం వెనుక లోకేష్..? ఇలాంటి విమర్శలు ఏంటి, ఖండించాల్సిన పని లేదా.. : పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు

Uma Maheswari : నందమూరి ఇంట మరణం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని సోమవారం నాడు మరణించారు. ఆవిడ మరణం నందమూరి కుటుంబ సభ్యులను శోకసంద్రం లో ముంచేసింది. అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ కూతురు కావడంతో సాధారణ జనానికి కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ ఆత్మహత్య చేసుకోవడంతో అసలేం జరిగిందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

సోషల్ మీడియాలో ‘హూ కిల్ల్డ్ పిన్ని’…

మనిషి చనిపోయిన బాధలో కుటుంబం ఉన్నపుడు నైతిక విలువలు కలిగిన ఎవరైనా సానుభూతి వ్యక్తం చేస్తారు. పోయిన మనిషి చేసిన మంచిపనుల గురించి మాట్లాడుతారు. అది వదిలేసి నెట్టింట్లో ట్రోల్ చేయడం ఆవిడ ఎలా చనిపోయింది అంటూ కాకుల్లాగా పొడచడం ఇప్పుడు ఉమా మహేశ్వరి గారి మరణం విషాదంలో జరుగుతున్న ఉదంతం. ఇక వీటిపై సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మనిషి చనిపోయి బాధలో ఉంటే ఇలాంటి ట్రోల్స్ ఏంటి అంటూ ఫైర్ అయ్యారు. రాజకీయ విమర్శలకు ఇలాంటి ఒక పరిస్థితిని వాడుకుంటారా. లోకేష్ ని ట్రోల్ చేస్తూ వైసీపీ వాళ్ళు ‘హూ కిల్ల్డ్ పిన్ని’ అంటూ ఆమె మరణం వెనుక లోకేష్ హస్తం ఉందంటూ ట్రోల్ చేయడం ఏం బాగోలేదని, అయితే వీటిపై టీడీపీ స్పందించి లీగల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. అలా స్పందించక పోతే ఇలాంటివి శృతి మించుతాయి అంటూ మాట్లాడారు.

వై ఎస్ వివేకానంద రెడ్డి మరణించినపుడు ‘హూ కిల్ల్డ్ బాబాయ్’ అంటూ టీడీపీ ట్రెండ్ చేసిందని ఇప్పుడు వైసీపీ ఆ పని చేస్తోంది. హెరిటేజ్ లో ఉమ గారికి వాటా ఉండటం వల్ల లోకేష్ కి ఉమా మహేశ్వరి గారికి వాగ్వాదం జరగడం వల్ల ఆ బాధలో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు అంటూ వైసీపీ కి చెందిన ఒక నేత ట్వీట్ చేయడం బాగోలేదు. ఆ ట్వీట్ చేసిన వారిపైన, ఇలాంటి ట్రోల్ల్స్ చేస్తున్న వాళ్ళపైన మనం స్పందించి విమర్శించడం కాదు టీడీపీ పార్టీ లీగల్ యాక్షన్ తీసుకోవాలి, కేసు పెట్టాలి. అలా ఎందుకు చేయడం లేదు ఈ దద్దమ్మలు అంటూ ఫైర్ అయ్యారు