Actress Jayapradha: సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పటికప్పుడు కాలానికి అనుకూలంగా అప్డేట్ అవుతూనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలం. లేదంటే ఇండస్ట్రీలో అవకాశాలు రావనే చెప్పాలి. ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోయిన్లు పాత్రలకు అనుగుణంగా ప్రస్తుతం గ్లామర్ షోలు చేస్తూ నటిస్తున్నారు.ఇలా స్కిన్ షో చేయకపోతే అసలు వారి హీరోయిన్లే కాదు అని అందరూ అభిప్రాయపడతారు.
కానీ గతంలో అలా కాదు హీరోయిన్ అంటే నిండుగా సాంప్రదాయమైన దుస్తులు ధరించి నటించేవారు.పాత్ర డిమాండ్ చేస్తే తప్ప వాళ్ళు గ్లామర్ పాత్రలలో నటించేవారు కాదు. ఇక బికినీ అంటే ఆమడ దూరం ఉండేవాళ్లు.ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హోమ్లీ హీరోయిన్ గా ఎంతో పద్ధతిగా నటించి అందరిని సందడి చేసిన నటి జయప్రద గురించి పరిచయం అవసరం లేదు.
అయితే ఈమె నటించిన దేవుడే దిగివస్తే అనే సినిమా కోసం బికినీ వేసుకోవాల్సి వచ్చిందని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు షూటింగ్ లొకేషన్లోకి వెళ్లగానే తనని డ్రస్ చేంజ్ చేసుకుని రమ్మని చెప్పారు. అయితే అక్కడికి వెళ్లేసరికి బికినీ చూసి ఆశ్చర్యపోయాను. వెంటనే డైరెక్టర్ గారి వద్దకు వచ్చి బికినీ ఉందని చెప్పగా బికినీ వేసుకొని రమ్మని చెప్పారు.
నేను వేసుకోనని ఎంత చెప్పినా డైరెక్టర్ గారు మాత్రం ఏం పర్వాలేదు, వెళ్లి బికినీ వేసుకొని రా అంటూ తనని బలవంతం చేశారని ఆ సమయంలో ఏం చేయాలో దిక్కుతోచక బాగా ఏడ్చానని జయప్రద తెలిపారు. ఇకపోతే తప్పని పరిస్థితులలో తాను బికినీ వేసుకొని వచ్చానని కేవలం బికినీలో స్విమ్మింగ్ పూల్ లోకి దూకే సన్నివేశాన్ని చిత్రీకరించారని జయప్రద వెల్లడించారు.ఇక దాని తర్వాత జీవితంలో తాను ఎప్పుడు బికినీ ధరించకూడదని నిర్ణయం తీసుకున్నానని ఈ సందర్భంగా ఈమె గతంలో జరిగిన సన్నివేశం గురించి వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…