Un stoppable season 2 : చంద్రబాబు భువనేశ్వరి పెళ్లి వెనుక వైస్సార్… ఎన్టీఆర్ కి వెన్నుపోటు వెనుక అసలు ఏంజరిగింది : సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Un stoppable season 2 : అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమో విడుదలయింది. మొదటి గెస్ట్ గా ఏపీ మాజీ సిఎం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గారు వచ్చారు. ఇక బాలకృష్ణ కు స్వయానా బావ అయిన చంద్రబాబు బాబు గారు అలాగే ఆయన తనయుడు లోకేష్ గారితో సరదా ప్రశ్నల్తో కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలతో ప్రోమో కట్ చేసారు. ఇక ప్రోమో విడుదల అయిన కాసేపటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ ట్రెండింగ్ లో మొదటి స్థానంలో నిలబడి బాలయ్య బాబు అంటే ఏంటో చూపించింది. ఇక ఈ షోలో చంద్రబాబు నాయుడు గారిని అడిగిన ప్రశ్నలు, ఇక ప్రోమోలో చూపించిన విషయాల మీద చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ ప్రోమో గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.

చంద్రబాబు పెళ్లి వెనుక వైస్సార్… వెన్నుపోటు కథ మళ్ళీ…

సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు అన్ స్టాపబల్ షోలో చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి నా మిత్రుడు అని చెప్పడం అలాగే వెన్నుపోటు అంశం గురించి మాట్లాడటం గురించి ఆయన అభిప్రయాలను చెప్పారు. ఇద్దరూ సమకాలిన నాయకులు, ఇద్దరి రాజకీయ జీవితం ఒకేసారి ఒకే పార్టీలో మొదలయింది. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇద్దరూ మంచి మిత్రులు. ఇక చంద్రబాబు వైస్సార్ ను సలహాలు అడిగేవారు. అలా ఆయనకు పెళ్లి సంబంధాల విషయంలో చిత్తూరు లో చంద్రబాబు నాయుడు కి రాజకీయ గురువు అయిన రాజగోపాల్ నాయుడు గారి కుటుంబం నుండి సంబందం, అలాగే ఎన్టీఆర్ ఇంటి సంబంధం, అలాగే ఇంకా వేరే మంచి సంబంధాలు వచ్చినపుడు వైస్సార్ ను సలహా అడుగగా ఎన్టీఆర్ గారి ఇంట్లో చేసుకోమని రాజశేఖర్రెడ్డి సలహా ఇచ్చాడట. ఆ తరువాత చంద్రబాబు మద్రాస్ కి షిఫ్ట్ అవడం పెళ్లి చేసుకోవడం జరిగిందట.

ఒకానొక సమయంలో నా వల్లే నువ్వు ఈనాడు ఈ స్థానంలో ఉన్నావు అంటూ వైస్సార్ అన్నారట. అయితే ఇద్దరూ మంచి మిత్రులుగా ఉండేవారు అంటూ భరద్వాజ చెప్పారు. ఇక చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా వెన్నుపోటు అంశాన్ని మనం ఆరోజు తీసుకున్న ఆ నిర్ణయం తప్పా అంటూ బాలకృష్ణ చేతనే మాట్లాడించారు. ఆయన డబ్బు పెట్టి ఎన్టీఆర్ ను కూలదోసి సీఎం అయ్యే పరిస్థితి కాదు కాబట్టి ఆయన సీఎం అయితే ప్రయోజనము పొందే వారిని చేరదీసి వారితో చందాలు వసూలు చేసి సీఎం అయ్యారు. కుటుంబాన్ని బాగా మేనేజ్ చేసారు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.