Dethadi Harika: సాధారణంగా సెలబ్రిటీల గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ఇందులో కొన్ని వార్తలలో నిజం ఉండగా మరికొన్ని వార్తలలో ఎలాంటి నిజం ఉండదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రముఖ యూట్యూబ్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దేత్తడి హారిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యూట్యూబ్ వీడియోలు,షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దేత్తడి హారిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా ప్రముఖ యూట్యూబర్ అని తెలుస్తుంది. ఈయన కూడా యూట్యూబ్ ద్వారా ఎన్నో వీడియోలు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని ఇలా గత కొన్ని సంవత్సరాల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వినపడుతున్నాయి.
ఈ విధంగా యూట్యూబ్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వీరిద్దరూ రహస్యంగా ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈమె పెళ్లి చేసుకోబోయే యూట్యూబ్ ఎవరు అనే విషయంపై చర్చలు మొదలయ్యాయి.ఇక సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దేత్తడి హారికకు బిగ్ బాస్ సీజన్ 4 అవకాశం కూడా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇందులో ఈమె టాప్ 5 వరకు వెళ్లి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.
ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న సమయంలోనే ఈమె కంటెస్టెంట్ అబితో కలిసి ఎంతో చనువుగా ఉన్నారని వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే బిగ్ బాస్ తర్వాత ఈ వార్తలకు పూర్తిగా చెక్ పడింది. అయితే ఈమె మాత్రం ఒక యూట్యూబర్ తో ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ వార్తలపై ఈమె స్పందించాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…