Featured

Manchu Lakshmi : బాహుబలిలో నటించానందుకు సంతోషంగా ఉంది.. ఆ పాత్రకు ముందు నన్ను అడిగారు.. కానీ ఎవరూ చేయలేని పాత్ర నేను చేసాను : మంచు లక్ష్మి

Manchu Lakshmi : దర్శకాధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసినా చాలు అనుకునే ఆర్టిస్టులు ఉన్నారు. ఒక్కసారైనా రాజమౌళి తో పని చేయాలని అనుకునేవాళ్ళు ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. అలాంటిది బాహుబలి లాంటి సినిమాలో కీలక పాత్రలో చేయమని అడిగితే మన మంచు లక్ష్మక్క నేను చేయను అని చెప్పిందట. పైగా ఆ సినిమా హిట్ అయినందుకు చాలా గర్వంగా ఉంది, ఆ పాత్ర చేయనందుకు ఆనందంగా ఉంది అంటూ చెప్పింది.

ఆ తరహా పాత్రలు చేయాలని అనుకోవడం లేదు…

మంచు లక్ష్మి హాలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్ లను చేసి ఇండియా వచ్చాక తెలుగులో ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాలో విలన్ పాత్రలో ఐరేంద్రి అనే మంత్రగత్తే పాత్రలో నటించింది. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలినా ఆ సినిమాలో పాత్ర తన ఆల్ టైం ఫేవరెట్ అంటూ చెప్పింది. ఇక విభిన్న తరహా పాత్రలు చేయాలని అనుకుంటున్నట్లు చెబుతూ బాహుబలి లో శివగామి పాత్రకు మొదట నన్నే అడిగినా నేను చేయను అని చెప్పాను అంటూ సోషల్ మీడియాలో పంచుకుంది.

ప్రభాస్ కి తల్లిగా నటిస్తే ఇక ఆ తరువాత ఆ తరహా పాత్రలే వస్తాయని అలాంటి పాత్రలే చేయడం నాకు ఇష్టం లేదంటూ లక్ష్మి చెప్పింది. ఇక ఆ సినిమా విడుదల అయి హిట్ అయ్యాక చాలా గర్వంగా ఫీల్ అయ్యానంటూ చెప్పింది. ఆ పాత్ర నాకు సెట్ కాదని చేయనందుకు హ్యాపీ గా ఫీల్ అయినట్లు చెప్పింది. తాజాగా మంచు లక్ష్మి మలయాళంలో మోహన్ లాల్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. గ్రాండ్ గా మలయాళం లో లాంచ్ అవుతోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago