Featured

Vijay Antony : విడాకులు తీసుకోబోతున్న మరో కోలీవుడ్ స్టార్ జంట..!

Vijay Antony : మ్యూజిక్ కంపోజర్ గా, సింగర్ గా, ఫిల్మ్ మేకర్ గా, హీరో గా ఇలా సినిమా కు ఉండే 24 క్రాఫ్ట్స్ లో చాలా వాటిలో టాలెంట్ ఉందని నిరూపించుకున్న నటుడు విజయ్ ఆంటోనీ. తమిళ సినిమా రంగంలో సింగర్ గా మ్యూజిక్ కంపోజర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ ఆ తరువాత నటుడుగా తన టాలెంట్ చూపించాడు. అయితే తెలుగులో మాత్రం ‘బిచ్చగాడు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఆ సినిమా ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదల అయి అదే సమయంలో విడుదల అయిన పెద్ద హీరోల సినిమాలను కాదని సూపర్ హిట్ గా నిలిచి మంచి కలెక్షన్స్ సాధించింది. ఆ సినిమా తరువాత విజయ్ తన తదుపరి సినిమాలను కూడా తెలుగులో విడుదల చేయడం మొదలు పెట్టారు.

విడాకులు తీసుకోబోతున్న విజయ్ ఆంటోనీ…

సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా కెరీర్ మొదలు పెట్టినపుడే విజయ ఆంటోనీ ఫాతిమా అనే టీవీ యాంకర్ ను ప్రేమించారు. ఆ తారువాత వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ ను కొనసాగిస్తున్నారు. కానీ తాజాగా విజయ్ ఆంటోనీ సోషల్ మీడియా లో పెట్టిన ఒక పోస్ట్ ఆయన భార్యతో విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తకు ఊతం ఇచ్చేలా ఉందని కోలీవుడ్ మీడియా అభిప్రాయ పడుతోంది. విజయ్ ఆంటోనీ తన సోషల్ మీడియా ఖాతాలను అంత ఎక్కువగా వాడరు. అలాంటింది ఆయన సోషలమీడియాలో పోస్ట్ పెట్టారంటే ఖచ్చితంగా ఏదో ఉంది అనే అనుమానాలు మొదలయ్యాయి.

కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే మనమే పరిష్కరించుకోవాలి, కానీ మూడో వ్యక్తిని దగ్గరకు రానివ్వకూడదు. మనం బాధపడుతుంటే చూసి సంతోషించే వాళ్ళు చాలామంది ఈ సమాజంలో ఉంటారు. మీ కుటుంబంలో సమస్య వస్తే మీరే పరిష్కరించుకోండి. ఒకవేల భార్యభర్తల మధ్య సమస్య పరిష్కరించుకోలేకపోతే ఇంటిని వదిలి దూరంగా వెళ్లి ఉండండి. అంతే కానీ మూడో వ్యక్తికి చోటు ఇవ్వకండి. మనం బాధపడుతుంటే చాలా మంది నేటి సమాజంలో మన బాధను చూసి ఆనందిస్తారు. అలాంటి మనుషులు ఈ సమాజంలో ఎక్కువగా ఉన్నారు అంటూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు. దీంతో విజయ్ ఆంటోనీ ఫాతిమా మధ్య మూడో వ్యక్తి వల్ల అభిప్రాయాబేధాలు వచ్చాయని త్వరలో విడిపోతారంటూ వార్తలు కోలీవుడ్ లో బాగా వినబడుతున్నాయి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago