Featured

Balakrishna : బాలయ్యకు నచ్చకపోయినా తండ్రికిచ్చిన మాట కోసం.. ఆ సినిమా చేయాల్సి వచ్చింది.. కానీ ఫలితం ముందుగా ఊహించిందే.!!

1988 లో ఒకరోజు పెద్దాయన ఎన్టీఆర్ ఇంటి నుండి పిలుపు రావడంతో కోదండరామిరెడ్డి ఆలోచనలో పడ్డారు. అన్నగారి సినిమాకు పనిచేశారు గాని ఆయనను దర్శకత్వం చేసే అవకాశం తనకు రాలేదు. మళ్లీ ఆయన నటిస్తే దర్శకత్వం చేయాలని కోదండరామిరెడ్డి ఆశపడ్డారు. ఒక దశలో పెద్దాయన అందుకే ఫోన్ చేశారేమో అని కోదండరామిరెడ్డి భావించారు. ఆ తర్వాత ఒకరోజు కోదండరాంరెడ్డి మరియు పరుచూరి బ్రదర్స్ ఉదయం 5 గం.లకు అన్నగారి దగ్గరికి వెళ్లారు‌. ఎందుకంటే ఎన్టీఆర్ అంత ఉదయాన్నే లేచి స్నానం ఇత్యాది కార్యక్రమాలు ముగించుకొని కాసేపు దైవ సన్నిధిలో గడపడం ఆయనకు అలవాటు.

వారిద్దరూ అక్కడికి చేరుకున్న తర్వాత పరుచూరి బ్రదర్స్ చెప్పిన స్టోరీ కోదండరామిరెడ్డికి నచ్చలేదని ఎన్టీఆర్ ముందే చెప్పేశారు. అన్నగారు కూడా బాగా ఆలోచించారు. మీకు మాత్రం నచ్చనప్పుడు ఏం చేస్తాం బ్రదర్.. తరువాత కలుద్దామని పెద్దాయన అనడంతో అక్కడి నుండి పరుచూరి బ్రదర్స్ కోదండరామిరెడ్డి బయటకు వెళ్ళిపోయారు. ఏంటయ్యా పెద్దాయన ముందు అలా నచ్చలేదని చెప్తే ఆయన ఏమనుకుంటారో కాస్త ఆలోచించారా? మీరు అని కోదండతో పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. కథ బాగోలేదని అనిపించినప్పుడు అలానే చెప్తాం కానీ బాగుందని ఎలా చెప్తాం. ఆ తర్వాత సినిమా ఆడకపోతే తిరిగి మనల్ని కదా పెద్దాయన అనేది అని కోదండరామిరెడ్డి, గోపాలకృష్ణల మధ్య కాస్త సంభాషణ జరిగింది. అదే కథను ఎన్టీఆర్ వినమని చెప్పడంతో బాలయ్య కూడా విన్నారు. కానీ ఎందుకనో ఆ సినిమా బాలయ్యకు కూడా నచ్చలేదు. కానీ తండ్రిగారి మాటకు కట్టుబడి సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా బాలయ్య నటించాలనుకున్నారు.

కట్ చేస్తే……
ఎక్కడో సినిమా షూటింగ్ లో పాల్గొన్న కోదండరామిరెడ్డికి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు నుండి ఫోన్ రావడం జరిగింది. ఏం బ్రదర్ ఆ రోజు మనం విన్న కథ నాకు ఎందుకో బాగా నచ్చింది. దానిని మనం కలిసి చేద్దాం అనడంతో కోదండరామిరెడ్డికి ఏం చేయాలో అర్థం కాలేదు. పెద్దాయన చెప్పడంతో చేసేది ఏమీ లేక బాలకృష్ణ హీరోగా “తిరగబడ్డ తెలుగు బిడ్డ” సినిమాని కోదండరామిరెడ్డి పూర్తి చేశారు. సినిమా విడుదలైన తర్వాత చూస్తే బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది… కథ చెప్పినప్పుడే విజువలైజేషన్ చేసుకునే కోదండరామి రెడ్డికి ప్రేక్షకుడి నాడి ఏమిటో ముందే తెలిసిపోతుంది అనడంలో సందేహం లేదు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago