Prabhas Seenu : పిల్లా నువ్వు లేని జీవితం, ఛత్రపతి, గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్య వంటి సినిమాల్తో కమెడియన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న శ్రీనివాస్, ప్రభాస్ శీను గానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గబ్బర్ సింగ్ లో తన నటనకు మంచి ప్రశంసలే కాకుండా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే సరైన ప్లానింగ్ కెరీర్ మీద పెట్టకపోవడం వల్ల ఆర్థికంగా కూడా బాగా నష్టపోయిన ప్రభాస్ శీను తన కెరీర్ మొదట్లో అనుభవాలను అవమానాలను తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. తనతో నటించిన నటుల గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ప్రభాస్ అందరినీ సమానంగా చూస్తాడు…
సినిమాల్లోకి రావాలని అనుకున్నపుడే ఇన్స్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ కోర్స్ చేసిన శీను ఆ తరువాత సత్యానంద్ గారి వద్ద శిక్షణ తీసుకోడానికి ఆయన దగ్గర చేరితే అపుడు హీరో ప్రభాస్ పరిచయమయ్యారు, అలా ఆ పరిచయంతో ప్రభాస్ కి కేర్ టేకర్ గా తనతోనే ఉండేవాడు. ఇక అలా సినిమా ఇండస్ట్రీలోకి ప్రభాస్ తో వచ్చిన శీను, ప్రభాస్ శీను అయ్యాడు. అయితే సినిమాల్లో అవకాశాలు వస్తే నువ్వు చేసుకో నాతోనే ఉండాల్సిన పని లేదు అని ప్రభాస్ గారు చెప్పారట.
ప్రభాస్ గారితో ఉండడం వల్ల శీను కి పరిచయాలు పెరగడం వల్ల అవకాశాలు కూడా వచ్చాయి. ఇక ప్రభాస్ మూడ్ ని బట్టి ఆయనతో ఉంటాను అంటూ చెప్పే ప్రభాస్ శీను తన దగ్గర పనిచేస్తున్న పనికి పేరు లేదు అంటూ చెప్పారు. తాను ఇది నీ జాబ్ అంటూ ఎవరినీ పనిలో పెట్టుకోడు. తన దగ్గర మేనేజర్, పర్సనల్ అసిస్టెంట్ అలా ఏం ఉండరు, జాబ్ కి ఒక పేరంటూ ఉండదు అందరినీ సమానంగా చూస్తారు ప్రభాస్. అందుకే అతను అందరినీ డార్లింగ్ అనే పిలుస్తాడు. చాలా ఓపిక ఎక్కువ, నాలాంటి వాడిని ఇన్నేళ్లు భరిస్తున్నాడంటే అది ప్రభాస్ గొప్పతనం అంటూ చెప్పాడు. ఇక ప్రభాస్ తో పాటూ ఆయన కుటుంబం కూడ నన్ను బాగా చూసుకుంటారు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…