సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్నో విజయవంతమైన సినిమాలలో “సింహాసనం” సినిమా ఒకటి అని చెప్పుకోవచ్చు.అయితే ఈ సినిమా విడుదలై దాదాపు 35 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ తరం వారికి ఈ సినిమా గురించి బహుశా తెలియకపోయి ఉండొచ్చు.ఈ సినిమాలోని ప్రత్యేకత గురించి తెలిస్తే మాత్రం వెంటనే ఈ సినిమాను చూడకుండా ఉండలేరని చెప్పవచ్చు. మరి కృష్ణ గారు నటించిన “సింహాసనం” సినిమా ప్రత్యేకతలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
కృష్ణ సింహాసనం సినిమా దర్శకత్వం, నిర్మాత, ఎడిటర్, హీరో అన్ని సూపర్ స్టార్ కృష్ణ గారే వ్యవహరించారు. అంతేకాకుండా తెలుగులో మొట్టమొదటి 70 ఎంఎం స్టీరియోఫోనిక్ సౌండ్ సినిమా కూడా ఇదే అని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రత్యేకత గురించి సింపుల్ గా చెప్పాలంటే 80 సంవత్సర కాలంలో ఈ సినిమా కూడా ఒక బాహుబలి సినిమా అని చెప్పవచ్చు. సింహాచలం సినిమా వసూళ్ల విషయంలో కానీ, రికార్డుల విషయంలో కానీ బాహుబలి సినిమాకు ఏ మాత్రం తీసిపోదని చెప్పవచ్చు.
ఈ సినిమా విడుదలైన సమయంలో సినిమా టికెట్ల కోసం ప్రేక్షకులు 12 కిలోమీటర్ల మేరా లైన్లో వేచి ఉన్నారంటే ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సృష్టించిందో అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఈ సినిమాను నిర్మించడం కోసం 3.5 కోట్ల రూపాయలు ఖర్చు కాగా ఈ కింద 5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ చెన్నైలో నిర్వహించగా కార్యక్రమానికి కృష్ణ అభిమానులు నాలుగు వందల బస్సులలో అక్కడికి చేరుకున్నారు. ఈ విధంగా 35 సంవత్సరాల క్రితమే అద్భుతమైన రికార్డులను సృష్టించిన సినిమా కృష్ణ నటించిన సింహాసనం సినిమా అని చెప్పవచ్చు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…