Upasana: మెగా కోడలు ఉపాసన కామినేని ప్రస్తుతం గర్భంతో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగి పదేళ్ల పూర్తయిన తర్వాత వారు తల్లిదండ్రులు కాబోతున్నారు. అయితే పెళ్లయిన ఇంత కాలానికి ఉపాసన గర్భం దాల్చడంతో అటు మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ వారసుడు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఉపాసన కూడా నిండు గర్భంతో మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవిస్తుంది. ఇంతకాలం గర్భంతో ఉన్నప్పటికీ ఉపాసన భర్తతో కలిసి విదేశాలలో వెకేషన్ ఎంజాయ్ చేసింది. అయితే ప్రస్తుతం నెలలు నిండటంతో ఇంటిపట్టునే ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తోంది. సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన ఎన్నో మంచి మంచి విషయాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఈ క్రమంలో మదర్స్ డే రోజున పుట్టబోయే బిడ్డ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను బిడ్డని కనటానికి గల కారణం గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. మదర్స్ డే సందర్భంగా బేబీ బంప్ తో ఉన్న ఫోటోని షేర్ చేసిన ఉపాసన..’ తల్లి కావాలనే నా నిర్ణయం వారసత్వం కొనసాగించాలని కోరిక లేదా నా వైవాహిక బంధం బలోపేతం చేయాలన్న కోరికతో తీసుకున్నది కాదు.
పుట్టబోయే నా బిడ్డకు అంతులేని ప్రేమ అందించడమే కాకుండా జీవితాంతం జాగ్రత్తగా చూసుకుంటానని మానసికంగా సిద్ధమైన తర్వాతనే తల్లి కావాలని నిర్ణయం తీసుకున్నా ‘ అంటూ ఉపాసన ఒక పోస్ట్ షేర్ చేసింది.
మదర్స్ డే సందర్భంగా ఉపాసన తాను తల్లి కాబోతున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా ఉపాసనకి బాబు పుట్టాలని..తండ్రి,తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాలని మెగా అభిమానులు ఎంతో ఆశపడుతున్నారు. అయితే మెగా ఇంట ఎవరు అడుగు పెట్టబోతున్నారో మరికొద్ది రోజులలో తెలియనుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…