Upasana: క్లీన్ కారా ఆ జాతిలో భాగం… దయచేసి ఎలాంటి ట్యాగ్ ఇవ్వదు… అభిమానులకు ఉపాసన రిక్వెస్ట్?

Upasana: మెగా ప్రిన్సెస్ క్లీన్ కారా గురించి రోజు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈమె జన్మించి నెల పూర్తి కావడంతో రామ్ చరణ్ ఒక స్పెషల్ ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు.ఇందులో ఎన్నో స్వీట్ మెమోరీస్ ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా క్లీన్ కారాను ఆపరేషన్ థియేటర్ నుంచి రామ్ చరణ్ బయటకు తీసుకురావడం హైలెట్ గా నిలిచింది.

ఇక ఈ వీడియోలో క్లీన్ కారా నామకరణ మహోత్సవం రోజు పలు రాష్ట్రాల చెంచు జాతులకు చెందినటువంటి వారు కూడా వారి నృత్యాలను చేస్తూ చిన్నారిని ఆశీర్వదించారు. అయితే ఇందులో భాగంగా ఉపాసన మాట్లాడుతూ అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేశారు. క్లీంకార నామకరణ కార్యక్రమాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఒడిస్సా అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు జాతి సంస్కృతిలో భాగంగా చేయడంతో అందరి మన్ననలు పొందారు.

ఇక చిన్నారి పుట్టినప్పటినుంచి తనని మెగా ప్రిన్సెస్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే తన కూతురికి ఎలాంటి ట్యాగ్ ఇవ్వద్దని ఈమె అభిమానులకు రిక్వెస్ట్ చేసుకున్నారు. క్లీంకార పేరుకి ముందు వెనుక ఎటువంటి ట్యాగ్స్ పెట్టకండి. అలాంటి ట్యాగ్స్ ని వారే కష్టపడి స్వయంగా సంపాదించుకోవాలి అనేది నా అభిప్రాయం. పిల్లల పెంపకంలో ఇది చాలా ముఖ్యమైంది అంటూ ఉపాసన తెలిపారు.

Upasana: కష్టపడి సంపాదించుకోవాలి…

ఈ విధంగా ఉపాసన ఇప్పటినుంచి తన కుమార్తె పెంపకం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా తనని చాలా క్రమశిక్షణలో పెంచాలన్న ఉద్దేశంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలియడంతో ఉపాసన నిర్ణయం పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈమె రిక్వెస్ట్ మేరకు అభిమానులు తన కుమార్తెను మెగా ప్రిన్సెస్ అని పిలవడం మానేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.