Movie News

Varuntej-Lavanya Tripati: ఎక్కడ ప్రేమ పుట్టిందో అక్కడే ఒకటి కాబోతున్న వరుణ్ తేజ్ లావణ్య… పెళ్లి ఎక్కడంటే?

Varuntej-Lavanya Tripati: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నారు.ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వరుణ్ తేజ్ నటించిన లావణ్య త్రిపాఠితో రహస్య ప్రేమాయణం నడిపారు.వీరిద్దరి ప్రేమ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చిన ఆ వార్తలు నిజం కాదంటూ ఖండించే ప్రయత్నం చేశారు కానీ ప్రేమ విషయాన్ని మాత్రం బయటపడనివ్వలేదు.

ఇలా రహస్యంగా గత ఏడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట చివరికి ప్రేమ విషయాన్ని బయట పెడుతూ ఎంతో అంగరంగ వైభవంగా ఇద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇలా వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం పూర్తి కావడంతో వీరి వివాహం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరూ మాత్రం తమ ప్రేమకు బీజం పడిన చోటే పెళ్లి కూడా జరగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరూ కలిసి మిస్టర్ అంతరిక్షం అనే రెండు సినిమాలలో నటించారు. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం మిస్టర్. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.

Varuntej-Lavanya Tripati: డెస్టినేషన్ వెడ్డింగ్…


ఇలా ఈ సినిమా షూటింగ్లో భాగంగా వీరిద్దరూ ఇటలీ వెళ్ళగా అక్కడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అందుకే తమకు ఇటలీ చాలా ప్రత్యేకమైనదనీ చెప్పాలి.ఇలా తమ ప్రేమ చిగురించినచోటే తమ పెళ్లి జరగాలని భావించిన ఈ జంట ఇటలీలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మరి వీరి వివాహం గురించి త్వరలోనే ప్రకటన రాబోతుందని తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

8 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

8 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

10 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

10 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

10 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

11 hours ago