Venkatesh: ఒకప్పుడు హీరో హీరోయిన్ల గురించి తెలుసుకోవాలంటే కేవలం వార పత్రికల ద్వారా మాత్రమే వారి గురించి తెలుసుకునేవారు అయితే సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఒక హీరో గురించి లేదా హీరోయిన్ గురించి తెలుసుకోవాలంటే క్షణం సమయం పట్టదు. సోషల్ మీడియాలో ఒక నటికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే ఎంతోమంది నటీనటులు ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాల ద్వారా వారికి సంబంధించిన విషయాలను మాత్రమే కాకుండా వారి సినిమా విషయాలను కూడా షేర్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం హీరోలు మాత్రమే కాకుండా వారి భార్యాపిల్లలు కూడా సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.
ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ఒక్కో పోస్టులతో భారీగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి సెలబ్రిటీలు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు.అయితే తనకు మాత్రం ఇలాంటి పాపులారిటీ ఇలాంటి సంపాదన వద్దు అంటూ ఏకంగా తను మాత్రమే కాకుండా తన ఫ్యామిలీని కూడా మీడియాకు దూరంగా ఉంచారు నటుడు దగ్గుబాటి వెంకటేష్.హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వెంకటేష్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. అలాగే తన భార్య పిల్లలను కూడా ఈయన సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంచారు.
ఇలా తన భార్య పిల్లలను కూడా దూరంగా ఉంచడానికి గల కారణం తనకు తన కుటుంబాన్ని మీడియా ముందుకు తీసుకురావడం ఏమాత్రం ఇష్టం లేదని తన కుటుంబ పరిధి వరకే తన విషయాలు తెలిసి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండటమే తనకిష్టమని తెలిపారు. తన వ్యక్తిగత విషయాలన్నింటిని అలాగే తన కుటుంబ సభ్యులను అందరికీ పరిచయం చేయడం అందరితో వారి విషయాలను పంచుకోవడం ఇష్టం లేనటువంటి వెంకటేష్ తన భార్య నీరజ అలాగే పిల్లలను కూడా పూర్తిగా సోషల్ మీడియాకు దూరం పెట్టారు. ఈ మధ్యకాలంలో తన కుమార్తె ఆశ్రిత సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య రానా సమంత వంటి వారు చేసిన పోస్టులకు రిప్లై ఇస్తూ ఉంటారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…