Vijay Devarakonda -Rashmika: సినీ నటుడు విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో ఉన్నారు అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తలకు అనుగుణంగా వీరిద్దరూ జంటగా కలిసి వెకేషన్ లోకి వెళ్లడం ఒకే చోట ఫోటోషూట్లు చేయించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరి ప్రేమ గురించి తరచు వార్తలు వినపడుతూనే ఉన్నాయి.
ఇలా ఉండగా ప్రస్తుతం పుష్ప 2 ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న రష్మిక మరోసారి తన ప్రియుడుతో కలిసి ఓ హోటల్లో సందడి చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి.
ఇటీవల ఓ ఆల్బమ్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తాను సింగిల్ కాదని ప్రేమలో ఉన్నాననే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు అయితే ఈయన ఎవరితో ప్రేమలో ఉన్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇకపోతే తాజాగా ఈయన రష్మికతో కలిసి ఓ హోటల్లో టిఫిన్ చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన సింగిల్ ఫోటోని రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ విధంగా రష్మిక తన ఫోటో ఒకటి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో మాత్రం విజయ్ దేవరకొండతో కలిసి ఈమె ఆ హోటల్లో టిఫిన్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను వైరల్ చేస్తున్నారు. బహుశా అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఈ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలుస్తుంది. ఇలా మరోసారి వీరిద్దరూ జంటగా హోటల్ లో కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఏ క్షణమైనా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…