Featured

Vijyendra prasad : విజయేంద్ర ప్రసాద్ ను అందుకే రాజ్యసభకు నామినేట్ చేసారా.. గాంధీ, నెహ్రు వల్ల కాశ్మీర్ ఇంకా మండుతుందంటూ.. కామెంట్స్ చేసిన విజయేంద్ర ప్రసాద్..!

Vijayendra prasad : దర్శకాధీరుడు రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారిని రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి కోటాలో ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక గతంలో ఆయన మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది, అదే ఆయనకు రాజ్యసభ సీట్ రావడానికి కారణం అంటూ నెటిజన్స్ భావిస్తున్నారు. ఆయన రాజ్యసభకు నామినేట్ అవ్వడం వెనుక చాలా మతలబు ఉందని అందరూ భావిస్తున్నారు.

ప్రసాద్ గారు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి…

రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. ఆ సినిమాలో దేశభక్తిని చాటి దేశం కోసం ప్రాణాలు వదిలిన వారికి అంకితమిస్తూ వచ్చే ఎత్తర జెండా పాటలో గాంధీ, నెహ్రు మనకు కనిపించరు. వల్లభాయ్ పటేల్, రాణి చెన్నమ్మ, టంగుటూరు ప్రకాశం పంతులు గారు వంటి వారిని చూపించారు. ఇక ఈవిషయం గురించి చాలా మందికి ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే ఒక ఇంటర్వ్యూ లో విజయేంద్ర ప్రసాద్ గారు ఆ పాట గురించి మాట్లాడుతూ పటేల్ గారు మొదటి ప్రధాని అయి ఉండాల్సింది, ఆనాడు పార్టీ ఓటింగ్ లో పటేల్ గారికి ఎక్కువ ఓట్లు వచ్చి ప్రధానమంత్రి అభ్యర్థి గా నిలిచినా గాంధీ నెహ్రు వైపు మొగ్గుచూపారు. ఇక పటేల్ గారు తన నేత్రుత్వంలో కాశ్మీర్ మినహా అన్ని సంస్థానాలను ఇండియా లో విలీనం చేయించారు. నెహ్రు వేలుపెట్టిన కాశ్మీర్ మాత్రం ఇప్పటికీ రావణ కాష్టం ల రగిలిపోతూనే ఉంది అంటూ ఆయన మాట్లాడిన వీడియో ను కంగనా రానౌత్ షేర్ చేయడం గమనార్హం.

ఇక ముందు నుండి విజయేంద్ర ప్రసాద్ గారు ఆర్ఎస్ఎస్ భావజాలానికి చెందిన వ్యక్తి అని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుక ఇంకా అనేక కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారు. కథ రచయిత గా ఆయనకు మంచి పేరుంది. ఆయన ప్రస్తుతం తెలంగాణ రజాకారుల కు సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నారని, ఇది సినిమాగా రూపొందిస్తారని సమాచారం. ఇక ఆర్ఎస్ఎస్ స్థాపకుడు హెగ్డేవార్ జీవిత కథను బయో పిక్ గా తీయబోతున్నారని, ఆ సినిమాను రాజమౌళి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇలా ఆయన రాజ్య సభకు నామినేషన్ వెనుక గట్టి ప్రణాళిక ఉందని అంటున్నారు.

Bhargavi

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

6 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

9 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

9 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago