సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అతని సినిమాలు ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతాయ అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రజినీకాంత్ సినిమాలలో తన నటనతో, లక్షలాది మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నారు. సినిమాలలో విలన్ లను ఒక ఆట ఆడించే ఇతను తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా నెమ్మదస్తుడట.
రజనీకాంత్, లత ల పెళ్లి ఫిబ్రవరి 26,1981 తిరుపతి లో జరిగింది. ఈ దంపతులకు ఐశ్వర్య,సౌందర్య అనే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.రజినీకాంత్ ఎక్కడికి వెళ్ళినా కూడా అతని వెంట భార్య కానీ కుమార్తెలు కానీ తప్పకుండా ఉంటారు. 1980 లో షూటింగ్ లో సెట్ పై రజిని ఉన్నప్పుడు తన కాలేజీ మాగజైన్ కోసం ఇంటర్వ్యూ నిమిత్తం ఆయనను తొలిసారి కలిశారు లత . ఆ ఇంటర్వ్యూలో వారిద్దరి అభిరుచులు ఒకటే అని వారు గ్రహించారు.
ఆ ఇంటర్వ్యూ అయిపోయాక పెళ్లి ప్రపోజల్ చేశారు రజినీకాంత్. మొదట ఊహించని ప్రపోజల్ కు షాక్ అయిన లత, ఆ తర్వాత ఆనందపడి తన తల్లిదండ్రులతో మాట్లాడాలి అని చెప్పిందట. ఇండస్ట్రీలో పలువురు ప్రముఖుల చేత తల్లిదండ్రులతో మాట్లాడిచ్చారు రజనీకాంత్. లత తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరు తిరుపతిలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.
ఇక రజిని,లత పెళ్లి రోజు సందర్భంగా ఒకసారి వారి పెద్ద కుమార్తె ఐశ్వర్య తన తల్లిదండ్రులకు సంబంధించిన ఒక స్వీట్ మెమోరీ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆ ఫోటోలో రజనీకాంత్ ముఖంపై తో రెడ్ కలర్ లిప్ స్టిక్ తో లత పెయింటింగ్ వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోని చూస్తే రజనీకాంత్, లత ఎంత అన్యోన్యంగా ఉన్నారో అర్థం అయిపోతుంది .
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…