Anupama Parameswaran: అనుమప పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన అందం.. అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ భామ తాజాగా ట్రోలింగ్ కు గురవుతుంది. ఓ డెబ్యూ హీరోతో లిప్ లాక్ సీన్ లో నటించడంతో నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
అయితే లిప్ లాక్ సీన్లంటే చాలామంది వెనకడుగు వేస్తారు. అయితే అది కూడా స్టార్ హీరోతో అయితేనే కొంతమంది ఒప్పుకుంటారు. సాధారణంగా యంగ్ హీరోలు కానీ డెబ్యూ హీరోలతో లిప్‌లాక్ సీన్ చేసేందుకు హీరోయిన్స్ ఒప్పుకోరు.
ఇలా అనుమప నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారిడితో లిప్ లాక్ చేయడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఆశిష్ రెడ్డి , మలయాళం కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో దిల్ రాజు నిర్మించిన “రౌడీ బాయ్స్” ట్రైలర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఆశిష్ రెడ్డికి ఇదే తొలి సినిమా. అనుపమ ఎన్నో సినిమాల్లో పద్ధతిగా కనిపించింది.
కానీ ఈ సినిమాలో రెచ్చిపోయి నటించినట్లు టాక్. వ్యక్తిగత ఇమేజ్ లేకుండా.. రెమ్యూనరేషన్ కోసం కొత్త కుర్రాళ్లకు లిప్‌లాక్ ఇచ్చేస్తావా..? కిస్ సీన్ చేయడానికి ఓ స్థాయి ఉండాలని.. అగ్ర నిర్మాత కొడుకు అయినంత మాత్రానా కిస్ ఇచ్చేస్తారా.. రెమ్యూనరేషన్ కోసం దిగజారి ప్రవర్తిస్తారా? అని అనుపమపై ట్రోలింగ్స్ మొదలు పెట్టేశారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. ఆశిష్, అనుపమ మధ్య దాదాపు 3-4 కిస్సింగ్ సీన్లు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా సంక్రాంతి కానుకగా సినిమా థియేటర్లలోకి రానుంది. మరి సినిమా చూసిన తర్వాత ట్రోలర్లు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇటీవల అనుపమకు మంచి హిట్ దొరకలేదు. ఈ సినిమా ద్వారా అయినా ఆమె మళ్లీ ట్రాక్ లోకి రావాలని చూస్తోంది. మరి ఆమె నెరవేరుతుందో లేదో తెలియాలంటే.. పండుగ వరకు ఆగాల్సిందే. గతంలో శ్యామ్ సింఘ రాయ్ ట్రైలర్‌లో నానితో కృతిశెట్టి లిప్-లాక్ సన్నివేశం కనిపించినప్పుడు కూడా చాలామంది నెటిజన్లు తీవ్రంగా కామెంట్లు చేశారు. అంతే కాదు.. ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ చేశారు. పద్ధతిగా కనపడే కృతిశెట్టి.. ఇలా లిప్ లాక్ సీన్లలో నటించడంతో అభిమానులు జీర్ణంచుకోలేక పోయారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…