Anchor Anasuya: అందరూ చూస్తుండగా అనసూయను పైకెత్తిన యూట్యూబర్ నిఖిల్… రచ్చ చేసిన అనసూయ!
Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూనే వెండితెరపై వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇకపై ఏదైనా పండుగలు లేదా ప్రత్యేక రోజులు వస్తే బుల్లితెర పై ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతాయి.
ఈ క్రమంలోనే ఉగాది పండుగ సందర్భంగా స్టార్ మా ఆగట్టునుంటావా.. ఈ గట్టు కొస్తావా అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి ఎంతో మంది కమెడియన్స్, సింగర్స్, యాంకర్స్, బుల్లితెర నటీనటులు పాల్గొని ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించారు.
ఇక ఈ కార్యక్రమంలో యాంకర్ అనసూయ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇలా ఆటపాటలతో ఎంతో సందడిగా కొనసాగిన ఈ కార్యక్రమంలో యాంకర్ రవి, బిగ్ బాస్ విన్నర్ సన్నీ, యూట్యూబర్ నిఖిల్ అనసూయను టార్గెట్ చేస్తూ తన పై పంచులు వేస్తూ తనని ఆట పట్టించారు.
ఇక ముక్కు అవినాష్ జ్యోతిష్యుడి గెటప్ లో వచ్చే అందరి జాతకాలు చేస్తూ సందడి చేశారు. ఈ క్రమంలోనే నిఖిల్ చేతి గీతలు చూస్తూ.. చేతిలో గీతలు అన్ని కనపడకుండా పోయాయని చెప్పడంతో వెంటనే అనసూయ అలా రుద్దుతున్నావ్ అంటూ నిఖిల్ కు సెటైర్ వేసింది.ఇలా అనసూయ నిఖిల్ పై సెటైర్లు వేయడంతో నిఖిల్ కూడా అనసూయ పై సెటైర్ వేశారు. ఇక నిఖిల్ అంతటితో ఆగకుండా ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా అనసూయను పైకి ఎత్తారు. ఇలా పైకి ఎత్తడంతో షాక్ అయిన అనసూయ తనని కిందికి దించాలని అరిచి గగ్గోలు పెట్టారు. అయితే తను చెప్పిన వాటికి ఒప్పుకుంటేనే కిందకు దింపుతానని నిఖిల్ చెప్పారు. దీంతో అక్కడున్న వారందరూ విజిల్స్..క్లాప్స్ తో హోరెత్తించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…