Categories: General News

అవుట్ లెట్‌కు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని సిమ్‌కు ఆధార్ లింక్ చేయండిలా..కొత్త పద్దతులు వచ్చేశాయి..!

మన దేశంలోని ప్రతి మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం టెలికం సంస్థలను ఆదేశించిన విషయం మనందరికి తెలిసిందే. ఇందులో భాగం గానే ప్రతి టెలికం సంస్థ తమ కస్టమర్లను ఆధార్ లింక్ చేసుకోవాలంటూ సంక్షిప్త సందేశాలు పంపిస్తోంది..

దీనికి టెలికాం సంస్థల వారు నిర్వహించే స్టోర్లు, మరియు వారి రిటైల్‌ ఔట్‌లెట్లలో మొబైల్‌ నెంబర్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. మొబైల్‌ వినియోగదారు వారి సంబంధిత టెలికాం సంస్థకు చెందిన స్టోర్‌కు గాని లేక రిటైల్‌ ఔట్‌లెట్లకు వెళ్లి తమ మొబైల్‌ నెంబర్‌ను తెలియజేయగానే ఆ నెంబర్‌కు ఒక ఒటిపి వస్తుంది. ఓటీపీతోపాటు ఆధార్‌ నెంబర్‌, బయోమెట్రిక్‌ మిషన్‌పై వేలిముద్రను వేయడం ద్వారా తమ పాత మొబైల్‌ నెంబర్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియ ముగుస్తుంది. ఆధార్‌ ఆధారిత ఇ-కెవైసితో ఇప్పుడు టెలికాం కంపెనీలు కొత్త సిమ్‌కార్డులను జారీ చేస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా పాత పద్దతి. తాజాగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ 2017 డిసెంబర్ 1 నుండి బయోమెట్రిక్ అనేది అవసరం లేకుండా, మనం సంబంధిత అవుట్ లెట్‌కు వెళ్లకుండా మన ఇంటి నుంచే చాలా సులువుగా సిమ్ కార్డు వెరిఫికేషన్ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు ట్రాయ్ ప్రకటించింది. సిమ్ రీవెరిఫికేషన్ కోసం ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు టెలికం డిపార్ట్మెంట్ వారు మూడు నూతన పద్ధతులను ప్రవేశపెట్టారు. ఇవి త్వరలో మనకు అందుబాటులోకి రానున్నాయి.


ఆ మూడు పద్దతులు ఏవి అంటే:

* ఆధార్ ఓటీపీ బేస్డ్
* యాప్ బేస్డ్
* ఐవిఆర్‌ఎస్ సదుపాయం.

ఓటీపీని ఉపయోగించి మీ మొబైల్ నంబర్‌ను ఆధార్‌కు అనుసంధానం చేయడం ఎలాగంటే..

1 మీ మొబైల్ నెంబర్ నుండి సంబంధిచిన టెలికం ఆపరేటర్‌కు మీరు జత చేసే ఆధార్ నెంబర్‌ను మెసేజ్ పంపించాలి.

2 మీ మెసేజ్ అందుకున్న సంబంధిత టెలికం ఆపరేటర్లు మీ ఆధార్ నెంబర్‌ను ధ్రువీకరిస్తారు.

3 మీ ఆధార్ ధ్రువీకరణ పూర్తి అయిన తరువాత‌, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ట్రాయ్) కు ఓటీపీ రిక్వెస్ట్‌ను పంపిస్తారు.

4 భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ నుంచి సంబంధిత వినియోగదారునికి సంబందించి మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

దీంతో ఆధార్ వెరిఫికేషన్ ఇ-కెవైసి పూర్తి అవుతుంది. అంతే కాకుండా ఇకపై కొత్తగా సిమ్ తీసుకునేవారు తప్పనిసరిగా ఇ-కెవైసి నమోదు చేయాలి. అయితే తాజాగా సుప్రీం కోర్టు మాత్రం గతంలో ఆధార్ తప్పనిసరి కాదు అని తీర్పు ఇచ్చిన విషయం మీకు తెలిసిందే. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ను అనుసంధానం చేయాల్సిందేనంటూ గడువును కూడా ప్రకటించింది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago