Categories: General News

ఆమెది కొరుకుడు మసాజ్..!ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్న కొరుకుడు మసాజ్(వీడియో)..

ఇప్పుడు ఏదైనా కొద్ది కాలమే.. తర్వాత ఏదైనా రొటీనై బోర్ కొడుతుంది. మళ్లీ కొత్తదేదో వింతగా వచ్చి పాతదాన్ని రిప్లేస్ చేస్తుంటుంది. అలాగే ఆయిల్‌తో చేసే మసాజ్ ఇప్పుడు మొహం మొత్తింది. ప్రస్తుతం కొరుకుడు మసాజ్ హల్‌చల్ చేస్తోంది. మసాజ్‌లో శరీరాన్ని ఆయిల్ మర్దనా చేస్తే.. ఇక్కడ మాత్రం శరీరాన్ని పండ్లతో కొరుకుతూ మసాజ్ చేస్తారు. నొప్పి లేకుండా కొరుకుతూ చేసే ఈ మసాజ్‌కు, అమెరికాలో ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. న్యూజెర్సీకి చెందిన డాక్టర్ డోరోతి స్టెయిన్ 1990లోనే శరీరాన్ని పళ్ళతో కొరుకుతూ చేసే ఈ మసాజ్ కనిపెట్టింది. రోజూ ఈ తరహా మసాజ్ చేసి అనారోగ్యంతో ఉన్న తన తల్లిని బాగు చేసింది. మంచి ఫలితాలు రావడంతో తర్వాత ఇదే తన వృత్తిగా ఎంచుకుంది.

మొదటగా రాక్ బ్యాండ్ కళాకారులకు ఈ కొరుకుడు మసాజ్ రుచి చూపించింది. ఆ నోటా ఈ నోటా పాకిపోయి ఆమె మసాజ్ కి మంచి పాపులరిటీ సంపాదించింది. అనేక మంది సెలబ్రిటీలు ఇప్పుడు ఆమె కస్టమర్లు. ఇప్పుడు ఆమెతో పోటీలు పడి కొరుకుడు మసాజ్ చేయించుకుంటున్నారు. స్థానికంగా డాక్టర్ డాట్‌అనే బిరుదు కూడా ఇచ్చారు. ప్రస్తుతం డాక్టర్ స్టెయిన్, వెయ్యి మందికి కొరుకుడు మసాజ్‌లో శిక్షణ ఇచ్చి, మసాజ్ సెంటర్‌ను నడుపుతోంది. అన్నట్టు ఒక సెషన్ మసాజ్‌కు డా.డోరోతి 150 యూఎస్ డాలర్లను ఛార్జ్ చేస్తోంది. అంటే మన కరెన్సీలో దాదాపు 10 వేల రూపాయలన్నమాట. ఇప్పటిదాకా ఈ మసాజ్ చేయించుకున్నవారంతా డాక్టర్‌కు మంచి కితాబే ఇచ్చారట. మసాజ్ బాలేదని ఎవరూ అనలేదట.మరీ మీరు ప్రయత్నించండి ఈ కొరుకుడు మసాజ్..

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 weeks ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago