దేశవ్యాప్తంగా శిథిలావస్దలో ఉన్న ఆలయాలు చాలా ఉన్నాయి. అవి కూలిపోతున్నా… పాలకులు పట్టించుకోని రోజులివి. కాని గుజరాత్‌లో ఓ ముస్లిం మాత్రం అలా చూస్తూ వదిలెయ్యలేదు. తన సొంత డబ్బులతో ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టి… శభాష్ అనిపించుకుంటున్నాడు. అహ్మదాబాద్‌కు సమీపంలోని మీర్జాపూర్ ప్రాంతంలో 500 ఏళ్లనాటి భిడ్ భంజన్ హనుమాన్ గుడి ఉంది. అయితే మందిరం శిథిలావస్థకు చేరింది. రోజు నమాజ్‌కు అటువైపుగానే వెళుతున్న మొయిన్ మెమన్ ఆలయాన్ని గమనించేవాడు. ఒక రోజు పూజారి దగ్గరకు వెళ్లి విషయమేంటో అడిగి తెలుసుకున్నాడు. ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆరా తీశాడు. పరిస్థితిని గమనించి… తనే స్వయంగా రంగంలోకి దిగాడు.
ఆలయాన్ని తానే అభివృద్ధి చేస్తానని పూజారికి చెప్పాడు. అన్నట్లుగానే సొంత డబ్బుతో ఆలయానికి సంబంధించిన అన్ని మరమ్మత్తులును చేపట్టాడు. కొత్త హంగులతో ఆలయానికి కొత్త మెరుగులు దిద్దుతున్నాడు. గుడికి సేవ చేయడం చాలా గర్వంగా ఉందంటున్నాడు మొయిన్ మెమన్. ఈ గొప్ప కార్యాన్ని బాధ్యతగా భావిస్తున్నానని.. గతంలో మందిర వైభవం చూసి పెరిగానని చెప్పుకొచ్చాడు. అలాంటిది ఇలా కూలడానికి సిద్ధంగా ఉండటంతో చూస్తూ ఉండలేకపోయానన్నాడు. వారంలో పనులన్నీ పూర్తి చేస్తానని చెప్పాడు. ఓ ముస్లిం అయినా మెమన్ చూపిస్తున్న మతసామరస్యం అందరికి ఆదర్శంగా నిలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…