Categories: General News

కూతురుని చేతులు, కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఇంట్లో ఉన్న కత్తిపీటతో టీడీపీ మహిళ నేతను అతికిరాతకంగా హత్య..!

ఇంట్లోకి ప్రవేశించి టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలిని కత్తిపీటతో పీకకోసి హతమార్చారు. కన్న తల్లి ముందే కుమార్తెను కట్టేసి తల్లిని కిరాతకంగా చంపారు కొందరు కిరాతకులు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కొత్తపల్లిలో సంచలనం సృష్టించింది. రామిళ్ల కవితకు 16 ఏళ్ల క్రితం మల్లయ్యతో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. కుటుంబ ఏర్పడిన కలహాలతో పదేళ్లుగా భార్యాభర్తలిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. కవిత తన తల్లిగారి గ్రామమైన కొత్తపల్లిలో ఇల్లు నిర్మించుకుని ఇద్దరు కుమార్తెలను చదివిస్తూ అక్కడే జీవిస్తుంది.. అంతేకాకుండా ప్రస్తుతం టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతోంది. ఆదివారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆమెను అతికిరాతకంగా చంపేశారు.

ఇద్దరు దుండగులు కిటికీలో నుంచి కవిత ఇంట్లోకి ప్రవేశించారు. వచ్చి రావడంతోనే ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఇది గమనించిన కూతురు శిరీష అరవడానికి ప్రయత్నించింది.కానీ దుండగులు ఆమె చేతులు, కాళ్లు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి పక్క గదిలో పడేశారు. ఇంట్లో ఉన్న కత్తిపీటతో కవిత మొఖంపై విచక్షణ రహితంగా కొట్టి చంపేశారు. ముఖం పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా దాడి చేశారు. కాగా హత్యకు పాల్పడిన దుండగులు మంకీ క్యాప్, మాస్క్‌లు ధరించినట్లు మృతురాలి కూతురు చెబుతోంది. డాగ్‌ స్క్వాడ్‌ సంఘటన స్థలం నుంచి ప్రధాన రహదారి వద్దకు వెళ్లి ఆగిపోయింది. నిందితులు బైక్‌పై వచ్చి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది..

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago