1980 దశకంలో ఎక్కువగా సాంఘిక చిత్రాలు వచ్చినప్పటికీ అందులో యాక్షన్ చిత్రాలు బాగా ఆడాయి. మొదట సామాజిక చైతన్యం గల న్యాయం కావాలి, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి చిత్రాల్లో చిరంజీవి నటించినప్పటికీ ట్రెండ్ మారడంతో యాక్షన్ చిత్రాల్లో నటించడం మొదలు పెట్టారు. అలా ఆయన ఖైదీ, ఇద్దరు కిలాడీలు, రోషగాడు, కిరాతకుడు, దేవాంతకుడు, పులి, రుస్తుం, దొంగ, పులి బెబ్బులి లాంటి యాక్షన్ చిత్రాల్లో చిరంజీవి నటించడం జరిగింది. ఆయనకు సమాంతర హీరోలందరూ దాదాపుగా అలాంటి చిత్రాల్లో నటించారు. చిరంజీవి ఫైట్ లు బాగా చేయడంతో ప్రేక్షకులు కూడా వాటిని ఎక్కువగా ఇష్టపడేవారు.
ఆ రోజుల్లో ఎన్టీ రామారావు పౌరాణిక చిత్రాలు, ఏఎన్నార్ సాంఘిక చిత్రాలు, కాంతారావు జానపద చిత్రాలు చూసిన ఆర్ నారాయణ మూర్తి తన ఉన్నత చదువు పూర్తి కాకముందే మద్రాసు వెళ్లారు. అక్కడ హీరో కృష్ణ నటించిన నేరము శిక్ష చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత దాసరి సలహాతో తిరిగి సొంతూరు వెళ్లి అక్కడ తన ఉన్నత చదువులు పూర్తి చేసి మళ్లీ మద్రాసు వచ్చారు. సినిమాల్లో చిన్న పాత్రలు వేసుకుంటూ.. తానే స్వయంగా నిర్మాణ రంగంలోకి దిగారు. 1984 లో స్నేహ చిత్ర బ్యానర్ ని స్థాపించి అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమాని రూపొందించడం జరిగింది. ఈ సినిమా 1984 లో ప్రారంభించినప్పటికీ సెన్సార్ బోర్డు యొక్క అవరోధాలను ఎదుర్కొని చివరికి 1986 లో విడుదలైంది. సామాజిక విప్లవ పంథాలో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది.
ఆ తర్వాత ఆలోచించండి, భూ పోరాటం, అడవి దివిటీలు, లాల్ సలాం, ఎర్రసైన్యం దండోరా, వీర తెలంగాణ లాంటి విప్లవాత్మక చిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహిస్తూ ఆ సినిమా లో ఆయన నటించడం జరిగింది. అయితే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చిరంజీవి హీరోగా నటించిన కొన్ని చిత్రాల్లో ఆర్.నారాయణ మూర్తి కొన్ని పాత్రలు వేయడం జరిగింది. చిరంజీవి నటించిన మొదటి చిత్రమైన ప్రాణం ఖరీదులో నూతన్ ప్రసాద్ కు పనివాడి పాత్రలో ఆర్.నారాయణమూర్తి నటించారు.
ఆ తర్వాత 1979లో తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాణ సారథ్యంలో కే.వాసు దర్శకత్వంలో వచ్చిన కోతల రాయుడు చిత్రంలో చిరంజీవి స్నేహితుడిగా ఆర్.నారాయణమూర్తి నటించారు. ఈ మధ్యకాలంలో ఆర్.నారాయణ మూర్తి నిర్మించి దర్శకత్వం వహించి నటించిన”మార్కెట్ లో ప్రజాస్వామ్యం” ప్రీరిలీజ్ ఫంక్షన్ కి నారాయణమూర్తి ఆహ్వానించడంతో వారి స్నేహానికి గుర్తుగా చిరంజీవి ఆ ఫంక్షన్ కి హాజరు కావడం జరిగింది.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…