Featured

డైరెక్టర్ కొరటాల శివ, పోసాని కృష్ణమురళి ల మధ్య రిలేషన్ ఏంటో తెలుసా?

టాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ దర్శక, రచయిత, నిర్మాతలలో పోసాని కృష్ణ మురళి ఒకరు. 100 సినిమాలకి పైగా సినిమాలు చేసిన ఆయన దగ్గర ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్స్, రైటర్స్ సహాయకులుగా పనిచేశారు. వారిలో దశరథ్, కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. కొరటాల శివ బీ.టెక్ చేశారు. ఆ తర్వాత ఓ ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో వరుసకి బావ అయిన పోసాని కృష్ణ మురళి వద్ద సహాయకుడిగా చేరారు. కొంతకాలం రచనా విభాగంలో పనిచేసిన కొరటాల సోలో రైటర్‌గా మారారు.

గోపీచంద్ హీరోగా వచ్చిన ఒక్కడున్నాడు సినిమాకి మొదటిసారి డైలాగ్ రైటర్ గా పనిచేశారు. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కొరటాల ఆ తర్వాత డార్లింగ్ ప్రభాస్ హీరోగా వచ్చిన మున్నా సినిమాకి పనిచేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించింది. సినిమా యావరేజ్ గా నిలిచినప్పటికీ డైలాగ్ రైటర్‌గా మాత్రం కొరటాలకి మంచి పేరు వచ్చింది. ఇదే క్రమంలో జూనియర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు.

ఈ సినిమాలతో కొరటాల పేరు టాలీవుడ్ లో బాగా వినిపించింది. దాంతో అందరూ ఇక ఆయన దర్శకుడిగా మారితే బావుంటుందని సలహాలిచ్చారు. ఇదే నేపథ్యంలో 2013లో ప్రభాస్ హీరోగా సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ సినిమానే మిర్చి. ఈ సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల శివ ప్రభాస్ ని చాలా కొత్తగా చూపించారు. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే ఒకే ఒక్క డైలాగ్ ప్రభాస్ స్టామినాను చూపించింది. ఈ సినిమా భారీ హిట్ అందుకోవడంతో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు.

అయితే ఇలా మూడు బ్లాక్ బస్టర్స్ తీసిన కొరటాల శివ ఎందుకు ఆయన గురువు గారిని మర్చిపోయారని టాక్ మొదలైంది. పోసాని కృష్ణ మురళి దర్శకుడు, రచయిత, నిర్మాత మాత్రమే కాదు. గొప్ప నటుడు కూడా. ఆయన పోషించిన ప్రతీ పాత్ర ఎంతో పేరు తీసుకువచ్చింది. గత ఏడెనిమిదేళ్ళుగా పోసాని కృష్ణ మురళి చాలా బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. కొన్ని సినిమాలు చేసే సమయం లేక వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఇంత బిజీ ఆర్టిస్ట్ అయిన పోసానికి మూడు సినిమాలలో ఒక్క అవకాశం కూడా కొరటాల ఇవ్వలేదని, ఆయనకి కృతజ్ఞత లేదని కామెంట్స్ వినిపించాయి.

దాంతో ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఆయనకి ఎదురైంది. ఈ ప్రశ్నకి కొరటాల స్పందిస్తూ.. నేను చేసిన మూడు సినిమాలలో పోసాని గారికి సరిపడే క్యారెక్టర్ లేదని.. ఆయనని చిన్న చిన్న పాత్రల్లో చూడాలనుకోవడం లేదని వెల్లడించారు. ఆ స్కోప్ లేకనే మా గురువుగారికి నా సినిమాలలో వేషం ఇవ్వలేకపోయానని.. తప్పకుండా ఆయనకి ఓ గొప్ప పాత్ర రాస్తానని చెప్పారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన నాలుగవ సినిమా భరత్ అనే నేను సినిమాలో మంచి రోల్ ఇచ్చారు. ఈ పాత్ర పోసానికి చాలా మంచి పేరు తీసుకువచ్చింది. ఇక కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ ఆచార్య తెరకెక్కిస్తున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

7 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

7 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

8 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

8 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

10 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

11 hours ago