ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ సంక్షేమ పధకాల అమలులో దూకుడు పెంచారు. అమ్మ ఒడి పధకం తరువాత మరి కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ప్రతి పేదవాడికి సొంతింటి కల నిరవేరుస్తానని ప్రజలకు మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాట నిజం చేయనున్నారు.
ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి ఆ స్థలాన్ని పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని ఒకవేళ ప్రభుత్వ భూమి లేని పక్షంలో భూమిని కొనుగోలు చేయాలని కలెక్టర్లకు సూచించారు జగన్. ఈ ఇంటి స్థలాలకు ఇప్పటినుంచే పని మొదలు పెట్టాలని 2020 ఉగాది లోపు ఖచ్చితంగా పని పూర్తిచేయాలని సీఎం జగన్ అన్నారు. ఈమేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, కొందరు అధికారులు హాజరయ్యారు. గ్రామ వాలంటీర్లు క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలు ప్రమామణికంగా తీసుకోవాలని అన్నారు. ఇళ్ల పట్టాలకోసం గుర్తించే స్థలాలు ప్రజలు ఆవాసయోగ్యంగా ఉండాలని మర్చిపోకూడదని అధికారులకు సీఎం సూచించారు. ప్రతిపేదవాడికి ఇళ్ల పట్టాలు అందాలని, అక్రమాలు జరిగితే అధికారులే భాద్యత వహించాలని హెచ్చరించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…