Categories: General News

తాగుబోతు తండ్రిపై పదేళ్లు కొడుకు తిరుగుబాటు : పెళ్లెందుకు చేసుకున్నావ్.. నన్నెందుకు కన్నావ్

ఇది ఓ పదేళ్ల పసివాడి కన్నీటి గాధ. పట్టుమని పదేళ్లు కూడా లేని ఈ బాబు ఇప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. అందరి పిల్లల్లా తాను ఆనందంగా నాన్నతో గడపాల్సిన ఆ పసివాడు ఇలా పోలీస్ స్టేషన్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. కన్నతండ్రి పెట్టే బాధలు తట్టుకోలేక పోలీసులకు కంప్లైంట్ చేశాడు. రోజూ తాగొచ్చి తల్లిని, తమను తండ్రి కొడుతున్నాడని బోరున ఏడుస్తూ తన బాధను పోలీసులకు చెప్పుకున్నాడు. ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు…. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి రోజూ ఇలాగే కొడుతున్నాడని చెప్పాడు.

కరీంనగర్ జమ్మికుంట మోత్కులగూడెంలో ఉండే శ్రీనివాస్ కొడుకే ఈ శశికుమార్. మద్యానికి బానిసైన శ్రీనివాస్ రోజూ తాగొచ్చి భార్య, కొడుకు శశికుమార్, కూతురును కొడుతున్నాడు. భార్య కూలీనాలీ చేసే తెచ్చిన పైసలే ఆ కుటుంబానికి ఆసరా. ఏనాడు కుటుంబాన్ని పట్టించుకోని శ్రీనివాస్…. తాగుడు పైసల కోసం భార్య, పిల్లలను హింసించేవాడు. సర్కారీ స్కూల్లో చదువుతున్న శశికుమార్ తండ్రి ఆగడాలను భరించలేక పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేశాడు. జమ్మికుంట సీఐకి తండ్రి శ్రీనివాస్ పెట్టే చిత్రహింసలను వివరించాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు కమిలిన శరీరాన్ని చూపించాడు శశికుమార్. బాబు ఒంటిపై దెబ్బలను చూసిన పోలీసులు శ్రీనివాస్ ను స్టేషన్ కు పిలిపించారు. బాబును ఓదార్చి తన తండ్రిని ఏమడగాలనుకుంటున్నావో అడగమన్నాడు. తండ్రి పెడుతున్న బాధలకు ఆ పసిహృదయం సంధించిన ప్రశ్నలకు అక్కడున్న వారి హృదయాలు కరిగిపోయాయి.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago