పూరి కనెక్ట్స్ మరియు పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ కలిసి సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్టైనర్ ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాకు నిర్మాతలు. హీరోగా యుంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్, హీరోయిన్స్ గా నిధి అగర్వాల్ మరియు కొత్త భామ నభా నటేష్ నటించిన విషయం తెలిసిందే.. అయితే జులై 18 వ తేదీన విడుదలైన ఈ చిత్రం తోలి రోజునుంచి మిక్స్డ్ టాక్ తో రన్ అవుతోంది.
అయితే ఎప్పటిలానే పూరి మార్క్ డైలాగ్స్ మరియు హీరో రామ్ ఎనర్జిటిక్ పర్‌ఫార్‌మెన్స్, మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు కాస్త ప్లస్ అయ్యాయి అనే చెప్పాలి. మొదటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం 7.8 కోట్ల రూపాయలు రాబట్టిందని ఈవిషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేసింది చిత్రయూనిట్. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. తొలి రెండు రోజుల్లోగా మొత్తంగా 25 కోట్ల రూపాయిలు వసూలు చేసిందని అంటున్నారు చిత్ర నిర్మాత ఛార్మి. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇది ఇలా ఉండగా వసూళ్ల పరంగా ఈ సినిమా మరింత పుంజుకునే అవకాశాలున్నాయని, తోలి మూడు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి రాబట్టవచ్చని అంచనాకి వస్తున్నారు ట్రేడ్ పండితులు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…