ప్రభాస్ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం ఏంటో తెలుసా?

సీనియర్ రెబల్ స్టార్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. జయంత్ సి పరాన్‌జీ దర్శకత్వంలో వచ్చిన ఈశ్వర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదటి సినిమాతోనే మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. పెదనాన్న కృష్ణంరాజులోని రెబలిజం తో రెబల్ స్టార్ ఇమేజ్ ఒక్క సినిమాతోనే తెచ్చుకున్నాడు. ఈ కటౌట్ చూసి ఇండస్ట్రీ మొత్తం హాలీవుడ్ హీరోలాంటి వాడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడని చెప్పుకున్నారు. ఫస్ట్ మూవీలోనే ఫైట్స్, డాన్స్, పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. ఇండస్ట్రీ మొత్తం ప్రభాస్ పెద్ద స్టార్ అవుతాడని చెప్పారు.

ఆ తర్వాత రాఘవేంద్ర సినిమా చేసి ఫ్లాప్ అందుకున్న ప్రభాస్ మూడవ సినిమా వర్షంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాకి ఎం.ఎస్.రాజు నిర్మాతగా వ్యవహరించాడు. త్రిష ఈ సినిమాతో భారీ హిట్ అందుకొని టాలీవుడ్‌లో సెటిలైంది. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ కి వచ్చిన ఇమేజ్ అండ్ స్టార్ డం ఊహించని విధంగా వచ్చేసింది. అంతేకాదు ప్రభాస్ కి ఎలాంటి కథ రాయాలి…ఏ రేంజ్ లో సినిమా తీయాలి..ఆయన హైట్ కి ఏ రేంజ్ లో విలన్ ఉండాలి.. హీరోయిన్ ఎవరిని తీసుకోవాలి.. లాంటి చాలా విషయాలు చర్చకి వచ్చాయి.

ఇక వర్షం సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమా చేయడానికి దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టారు. ఈ క్రమంలో అడవి రాముడు, చక్రం సినిమాలొచ్చాయి. అడవి రాముడు సినిమాకి స్టార్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిర్మాత ప్రముఖ సీనియర్ నిర్మాత ఆనం గోపాలకృష్ణ. కానీ బడ్జెట్ ఇష్యూస్ రావడంతో ప్రాజెక్ట్ మధ్యలోనే ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత చంటి అడ్డాల ఈ ప్రాజెక్ట్ టేకోవర్ చేశారు. భారీగా ఖర్చు చేసి సినిమా తీసినప్పటికి సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. టైటిల్ కి ప్రేక్షకులు ఊహించుకుంది వేరే. కానీ థియేటర్స్ లో చూశాకా బాగా డిసప్పాయింట్ అయ్యారు.

ఇదే క్రమంలో వచ్చిన మరో సినిమా చక్రం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ప్రభాస్ లాంటి కమర్షియల్ హీరో చక్రం లాంటి సినిమా అంటే పెద్ద ప్రయోగం. ముఖ్యంగా ఇలాంటి క్లాసీ కథలో ప్రభాస్ ని జనాలు ఊహించుకోలేరు. వర్షం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ రేంజ్ కి చక్రం లాంటి సినిమా ఏమాత్రం వర్కౌట్ కాదు. అదే జరిగింది. పైగా ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే కొత్తది ఏమాత్రం కాకపోవడం పెద్ద మైనస్ అయింది. అలాంటి పాయింట్ తో అప్పటికే చాలా సినిమాలొచ్చాయి. అందుకే చక్రం మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఎంత ప్రభాస్ తన భుజాల మీద సినిమాను మోసిన కథ బలమైంది.. కొత్తదనం లేనిదైతే ప్రేక్షకులను మెప్పించలేదు. అలాంటి వాటికి ఉదాహరణ చక్రం సినిమా.