Categories: General News

బయటపడ్డ ఎస్బీఐ బండారం..వినియోగదారులను భారీగా మోసం చేస్తున్న ఎస్బీఐ

దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ తన వినియోగదారులను భారీగా మోసం చేస్తోంది. అసలు ఎందుకు కట్ చేస్తున్నారో కూడా తెలియకుండా వినియోగదారుల అకౌంట్లలో నుంచి డబ్బులు కట్ చేస్తూ.. అడిగిన వారితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అ తేకాదు కొన్నిసార్లు డబ్బులు ఎందుకు కట్ చేస్తున్నారో బ్యాంకు అధికారులకే తెలియవు. ఇటీవల క్రిష్ణ మోహన్ శర్మ అనే వ్యక్తి ఖాతాలో నుంచి 150 రూపాయలు కట్ అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది.

దీంతో వెంటనే అనుమానం వచ్చిన క్రిష్ణ మోహన్‌ శర్మ, తన ఖాతా ఉన్న ఎస్‌బీఐ బ్యాంకు ఏ.ఎస్‌.రావు నగర్ బ్రాంచ్‌కి వెళ్లి వివరణ కోరాడు. బ్యాంకు అధికారులు అతనికి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై వెంటనే క్రిష్ణ మోషన్‌ శర్మ “బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్‌”కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన బ్యాంక్ అధికారులు అకౌంట్ స్టేట్‌మెంట్‌ కోసం 150 రూపాయలు కట్ చేసినట్లు తెలిపారు. అసలు బ్యాంకు స్టేట్మెంటే తీసుకోలేదని.. ఆ సమయంలో బ్యాంకులోనే లేనని.. అయినా అధికారులు డబ్బులు కట్ చేశారని వాపోయాడు.

బ్యాంకు అధికారుల తీరును రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినా అతడికి న్యాయం జరుగలేదు. అయితే పట్టువదలని క్రిష్ణమోహన్ కోర్టును ఆశ్రయించాడు. హిడెన్ చార్జీల రూపంలో అర్థం పర్థం లేని చార్జీలను కస్టమర్ల అకౌంట్ల నుండి కట్ చేస్తున్నారని, ఇది తన ఒక్కడి సమస్య కాదని ప్రతి వినియోగదారుడికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతున్నాయని తన ఆవేదన వ్యక్తపర్చాడు. కోర్టు వెంటనే ఎస్‌బీఐ బ్యాంక్ ఏ.ఎస్‌.రావు నగర్ బ్రాంచ్ అధికారులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని కుషాయిగూడ పోలీసులను ఆదేశించింది..

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago