కొత్తగా ఏదైనా స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయాలని చూస్తున్నారా ? లేదంటే మీరు ఏదైనా స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారా ? అయితే నిధుల కోసం ఏ బ్యాంకులో పడితే ఆ బ్యాంకులో ఖాతాను ఓపెన్ చేయకండి. కేంద్రం సూచించిన కొన్ని బ్యాంకుల్లోనే ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇకపై దేశంలో ఉన్న ఏ స్వచ్ఛంద సంస్థ అయినా కేంద్రం విడుదల చేసిన జాబితాలో ఉన్న ఏదైనా బ్యాంకులో మాత్రమే ఖాతాలను ఓపెన్ చేయాలి. అందులోకి వచ్చే నిధులనే వాడాల్సి ఉంటుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు,సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,డీసీబీ బ్యాంక్ లిమిటెడ్, ఆంధ్రాబ్యాంక్,యాక్సిస్ బ్యాంక్, ద కాస్మస్ కో ఆపరేటివ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, తమిళనాడు మెర్సటైల్ బ్యాంక్ లిమిటెడ్, ద క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ లిమిటెడ్, యూసీఓ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ లిమిటెడ్, సిండికేట్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ద జమ్మూ కశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలహాబాద్ యూపీ జర్మన్ బ్యాంక్,సిటీ యూనియన్ బ్యాంక్, మణిపూర్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, విజయ బ్యాంక్, బాంబే మెర్సంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఎస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, అబూదబీ కమర్షియల్ బ్యాంక్.
పైన సూచించిన బ్యాంకుల్లో మాత్రమే స్వచ్ఛంద సంస్థలు ఖాతాలను ఓపెన్ చేయాలి. వాటిల్లోనే లావాదేవీలను నిర్వహించాలి. తప్పితే వేరే బ్యాంకుల్లో ఖాతాలను ఓపెన్ చేయడానికి లేదు. అయితే కేంద్రం ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందో తెలుసా..?
కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నాయని, వాటిని ఆ సంస్థలు చట్ట వ్యతిరేక పనులకు వాడుతున్నాయని కేంద్రానికి తెలిసిందట. అందుకనే అలా జరగకుండా ఉండేందుకు ఈ కొత్త రూల్‌ను కేంద్రం అమలు చేస్తుంది. ఇదీ.. ఈ రూల్ వెనుక ఉన్న అసలు నిజం..!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…