తన ప్రియురాలి వివాహ రిసెప్షన్‌కు వచ్చాడో యువకుడు. అంతే కాకుండా బహుమతి ఇచ్చి మరీ వధూవరులను ఆశీర్వదించాడు. అదును చూసుకొని వధువుతో కలిసి ఉడాయించాడీ ఘనుడు.. ఆమెను ఆలయంలో వివాహం చేసుకొని సరాసరి పోలీసులను ఆశ్రయించాడు.ఈ ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో చోటు చేసుకుంది. తిరువలానికి చెందిన యురేసియా(24) చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది.
ఆమె గతంలో భెల్ సంస్థలో పనిచేస్తున్న వెంకటేశన్(25) తో ప్రమలో పడింది.. వీరి ప్రేమను యురేసియా కుటుంబీకులు అంగీకరించలేదు. అంతే కాకుండా పొన్నైకు చెందిన యువకుడితో ఆమెకు వివాహం నిశ్చయించారు. గురువారం వేకువజామున వివాహం జరగాల్సి ఉండగా బుధవారం రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వెంకటేశన్ అదును చూసుకొని వధువుతో సహా జంప్ అయ్యాడు.
దీంతో పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు తరపువారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అమ్మాయికి అప్పటికే వివాహమైనందున వెంకటేశన్ ను కిడ్నాప్ కేసు కింద అరెస్టు చేయాలని పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు తరపువారు పోలీసులను ఆశ్రయించారు. యురేసియా మాత్రం తనకు ఇష్టం లేని పెళ్లి చేసిన తమ వారిపైనే చట్టరిత్యా చర్యలు తీసుకుని తమ ప్రేమను నిలబెట్టాలని పోలీసులను వేడుకుంటోంది. ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు పోలీసులు..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…