జియో.. టెలికాం కంపెనీలను ఒక్కసారిగా మటాష్ చేసినా.. కొత్త తరం కుర్రోళ్ల ఆలోచనలకు మాత్రం గట్టి పని చెప్పింది. జియో దెబ్బకి డేటా చీప్ అయ్యిందని అందరూ అనుకుంటుంటే.. మేము అంతకంటే మరింత చౌకగా డేటా ఇస్తాం ఎక్కడ కావాలంటే అక్కడ వైఫైతో కనెక్ట్ అయ్యి కవాల్సినంత వాడేసుకోండి అంటోంది బెంగళూరుకి చెందిన ఇంటర్నెట్ డేటా. గతంలో రూపాయి కాన్ బాక్స్ లు ఉన్నట్లు.. ఇప్పుడు విఫి డబ్బాలు తీసుకొచ్చింది. ప్రస్తుతం బెంగళూరులో ఇప్పుడు ఏ చిన్న షాపు దగ్గర చూసినా ఈ డబ్బాలు దర్శనం ఇస్తున్నాయి. బెంగళూరు సిటీలో 350 వైఫై డబ్బాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. మరో 1800 కనెక్షన్స్ పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు ఆ కంపెనీ ప్రతినిధులు..
ఈ వైఫై డబ్బాలు ఎలా పని చేస్తాయి :
వైఫై రూటర్లను డబ్బాల్లో వివిధ ప్రాంతాల్లో షాపుల దగ్గర పెడతారు. ఇది 200 మీటర్ల దూరం వరకు కనెక్ట్ అవుతుంది. 50ంబ్ప్స్ స్పీడ్ వస్తుంది. 100ంబ్ – రూ.2, 500 ంబ్ – రూ.10, 1ఘ్భ్ – రూ.20. వ్యాలిడిటీ 24 గంటలు ఉంటుంది. ఈ వైఫై డబ్బాలను షాపుల దగ్గర ఏర్పాటు చేస్తారు. అందులో మీకు కావాల్సిన ప్యాకేజీకి ఓచర్ కార్డు కొనుగోలు చేసుకోవాలి. కనెక్ట్ కావడానికి సంబంధిత వెబ్ సైట్ కు వెళ్లి మన ఫోన్ – కార్డులోని నెంబర్ ను ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తోంది. దాన్ని ఎంటర్ చేయగానే వైఫై కనెక్ట్ అవుతుంది. మనం మొబైల్ నంబర్ ను రీఛార్జ్ చేసుకున్న విధంగానే ఉంటుంది. మొబైల్ ప్రీ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కనీసం రూ.2 నుంచి రూ.20 వరకు ప్యాకేజీలు ఇందులో ఉన్నాయి. 1ఘ్భ్ డేటాను చాలా తక్కువగా 20 రూపాయలకే అందిస్తున్నారు. ప్యాకేజీలతో కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు 2, 10 రూపాయల్లో వైఫై డబ్బా అందుబాటులో ఉండటంతో ఒకేసారి నెట్ డేటా కోసం వందలకు వందల రూపాయలు చెల్లించే బాధ తప్పిందంటున్నారు బెంగళూరువాసులు.
ప్రస్తుతం బెంగళూరు సిటీలో విస్తరిస్తున్న ఈ వైఫై డబ్బాలు.. రాబోయే రోజుల్లో మన సిటీకే కాకుండా ప్రతి పల్లెపల్లెకి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…