హీరో డా.రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం. పూజా కుమార్, శ్రద్ధాదాస్, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై ప్రవీణ్ సత్తారు దర్వకత్వంలో కోటేశ్వర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను నవంబర్ 3న విడుల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ చాలా ఎమోషనల్ అయ్యారు.
నా సినిమా ‘గరుడ వేగ’ ట్రైలర్ 5 మిలియన్ వ్యూస్ వచ్చిందని చెప్పినపుడు మా మమ్మీ కూడా ఉన్నారు. ఆమె కూడా చాలా సంతోష పడ్డారు. నెక్ట్స్ డే చనిపోయారు. అంతకు ముందు రోజు వరకు నేను మేఘాల్లో తేలిపోయినంత సంతోషంగా ఉన్నాను. చాలా లాంగ్ టైమ్ తర్వాత ఈ సినిమాతో సక్సెస్ వస్తుందనే నమ్మకం ఈ సినిమాతో ఏర్పడింది… అని రాజశేఖర్ అన్నారు.
200 కోట్ల ఆస్తులు అమ్ముకున్నా ముందు నుండీ మా అమ్మకు ఉన్న పెద్ద బాధ ఒకటే. నా కొడుకు చాలా లాస్ అయిపోయాడు అని. చెన్నైలో ఉన్న చాలా బిల్డింగ్స్ అమ్మేశాను. అదంతా ఉంటే దాదాపు రూ. 200 కోట్ల ఆస్తి ఉండేది. కానీ రాంగ్ టైమ్ లో రాంగ్ సినిమాలు చేయడం, నాకు సూట్ కాని సినిమాలు చాలా చేసి నష్టపోయాను. తమిళంలో సూదు కవ్వం అనే సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. ఆ సినిమా తెలుగులో చేద్దామని చేసి ఆరేడు కోట్లు పోగొట్టుకున్నాను. ఇలా చాలా డబ్బులు పోయాయి…. అని రాజశేఖర్ అన్నారు.
సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్‌కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్‌కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్‌లో మైలురాయిగా నిలిచిన…
ప్రసిద్ధ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…