Categories: FeaturedGeneral News

ఆ గుడిలో కరోనా కల్లోలం.. 400 మందికి వైరస్ నిర్ధారణ..!

దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తుందో, వ్యాప్తి చెందుతుందో తెలియడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒకే గుడిలోని 400 మంది కరోనా బారిన పడ్డారు. ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన 400 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడం గమనార్హం. ఆలయ అధికారులు తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ప్రముఖ దేవాలయాలు ప్రజలను దర్శనానికి అనుమతి ఇస్తున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

గత కొన్ని రోజులుగా భక్తులు పూరీ దేవాలయాన్ని తిరిగి తెరవాలని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ వార్త అటు భక్తులను, ఇటు అధికారులను ఆందోళనకు గురి చేస్తుండటం గమనార్హం. లాక్ డౌన్ అమలైనప్పటి నుంచి నుంచి పూరీ జగన్నాథ్ ఆలయం మూసి ఉంది. ఆలయ పర్యవేక్షణ అధికారి అజయ్‌ కుమార్‌ జేనా మాట్లాడుతూ 9 మంది మృతి చెందగా 16 మంది ఆస్పత్రిలో చికిత్స్ పొందుతున్నారని వెల్లడించారు.
 
భువనేశ్వర్‌లోని కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 16 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కరోనా సోకిన మిగతా సిబ్బంది హోం ఐసోలేషన్ ద్వారా చికిత్స పొందుతున్నారు. ఆలయాన్ని తెరవడానికి సిబ్బంది కొరత ఉండటంతో ఇప్పట్లో ఆలయం తెరిచే పరిస్థితి లేదని సమాచారం. ప్రస్తుతం పూరీ జగన్నాథుని ఆలయంలో నిత్య పూజలు మాత్రం యథాతథంగా జరుగుతున్నాయి.
 
మరికొన్ని నెలల పాటు భక్తులను ఆలయంలోకి అనుమతించే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఒడిశా హైకోర్టుకు ఇప్పటికే ఈ మేరకు నివేదిక అందింది. 822 మంది ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 400 మంది కరోనా బారిన పడినట్టు తేలింది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago