దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తుందో, వ్యాప్తి చెందుతుందో తెలియడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒకే గుడిలోని 400 మంది కరోనా బారిన పడ్డారు. ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన 400 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడం గమనార్హం. ఆలయ అధికారులు తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ప్రముఖ దేవాలయాలు ప్రజలను దర్శనానికి అనుమతి ఇస్తున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

గత కొన్ని రోజులుగా భక్తులు పూరీ దేవాలయాన్ని తిరిగి తెరవాలని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ వార్త అటు భక్తులను, ఇటు అధికారులను ఆందోళనకు గురి చేస్తుండటం గమనార్హం. లాక్ డౌన్ అమలైనప్పటి నుంచి నుంచి పూరీ జగన్నాథ్ ఆలయం మూసి ఉంది. ఆలయ పర్యవేక్షణ అధికారి అజయ్ కుమార్ జేనా మాట్లాడుతూ 9 మంది మృతి చెందగా 16 మంది ఆస్పత్రిలో చికిత్స్ పొందుతున్నారని వెల్లడించారు.
భువనేశ్వర్‌లోని కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 16 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కరోనా సోకిన మిగతా సిబ్బంది హోం ఐసోలేషన్ ద్వారా చికిత్స పొందుతున్నారు. ఆలయాన్ని తెరవడానికి సిబ్బంది కొరత ఉండటంతో ఇప్పట్లో ఆలయం తెరిచే పరిస్థితి లేదని సమాచారం. ప్రస్తుతం పూరీ జగన్నాథుని ఆలయంలో నిత్య పూజలు మాత్రం యథాతథంగా జరుగుతున్నాయి.
మరికొన్ని నెలల పాటు భక్తులను ఆలయంలోకి అనుమతించే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఒడిశా హైకోర్టుకు ఇప్పటికే ఈ మేరకు నివేదిక అందింది. 822 మంది ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 400 మంది కరోనా బారిన పడినట్టు తేలింది.



























