బిగ్ బాస్ 5 తెలుగులో హౌజ్ లో అడుగు పెట్టిన 19 మంది కంటెస్టెంట్లలో మానస్ కూడా ఒకరు. అందులో కూడా ప్రస్తుతం మానస్ టాప్ 5 లో ఉన్నాడు. మానస్ పలు సీరియళ్లలో కాకుండా.. సినిమా హీరోగా కూడా రెండు సినిమాల్లో నటించాడు. ఇక మానస్ కు హౌజ్ లోకి వెళ్లకముందు ఉన్న క్రేజ్ వెళ్లిన తర్వాత ఇంకా పెరిగిపోయింది.
ఫ్యాన్ బేస్ విపరీతంగా పెంచుకున్నాడు మానస్. అతడు హౌజ్ లో మెచ్యూర్డ్ థింకింగ్‌తో అటు కుటుంబ ప్రేక్షకుల్ని, ఇటు యువతని అమితంగా ఆకట్టుకున్నాడు. సైలెంట్ గా తన పని తాను కానిస్తాడని పేరు ఉంది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం.. అతడు హీరోగా మరో సినిమాకు కన్ఫర్మ్ అయ్యాడు. ‘5జి లవ్’ అనే చిత్రంలో మానస్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.
‘స్క్వేర్ ఇండియా స్టూడియోస్ బ్యానర్‌పై ప్రతాప్ కోలగట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇక అతడు హౌజ్ నుంచి బయటకు రాగానే మరికొన్ని ప్రాజెక్టులతో బిజీ కానున్నాడు. బాలనటుడిగానే అతడు ఎన్నో సినిమాల్లో నటించాడు. కాగా మానస్ ‘బిగ్ బాస్’ క్రేజ్ వల్ల అతను నటించిన సినిమాలకు కూడా ప్లస్ అవుతుందనే చెప్పాలి.
ఎందుకంటే.. అతడు 2021లో హీరోగా నటించిన సినిమా క్షీర సాగర మథనం. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో విపరీతంగా ప్రేక్షకాధరణ పొందుతోంది. అతడు హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఓటీటీలో విడుదలవ్వగా.. ప్రస్తుతం అనూహ్య స్పందన వస్తోంది. ఇక హౌస్ నుంచి బయటకి వచ్చిన వెంటనే మానస్ మరిన్ని ప్రాజెక్టులతో బిజీ కానున్నాడు. ఇక ఈ విషయం తెలవడంతో మానస్ తల్లితో పాటు.. ఫ్యాన్స్ కూడా ఖుషీ అయ్యారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…