Categories: FeaturedMovie News

బామ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నిర్మలమ్మ.. అలాంటి గొప్ప నటీమణి మళ్ళీ ఇండస్ట్రీకి దొరకడం కష్టమే..

సినిమా ఇండస్ట్రీలో కళామతల్లి ఆశీస్సులు దక్కడం అంటే ఎంతో అదృష్టం. సినిమా ఇండస్ట్రీకి రావాలని మంచి నటీ నటులుగా నిలబడాలని తాపత్రయపడేవారు ఎంతోమంది. కానీ, అందరికి ఆ అవకాశం రాదు. వచ్చినా ఇంతపెద్ద భారీ పోటీలో నిలబడి నెగ్గడం చాలా కష్ఠం. అప్పటివారు అనుకుంటారు.. ఈ తరం నటీ నటులకు చాలా సులభంగా అవకాశాలు వస్తున్నాయని. ఇప్పటివారు అనుకుంటున్నారు అప్పట్లోనే సినిమాలలో అవకాశాలు చాలా సులభంగా  దక్కించుకున్నారని. కానీ ఎప్పుడు ఉండే పోటీ..కష్ఠం అప్పుడున్నాయి.

బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నిర్మలమ్మ. అప్పట్లో ఆమెకున్న అందానికి హీరోయిన్‌గా చేయడానికే ఎక్కువ ఆస్కారం ఉంది. కానీ, కళామతల్లి ఒక్కొక్కరిని ఒక్కోలా వరిస్తుంది. అలా నిర్మలమ్మను అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాపులర్ అయ్యేలా చేసింది. 800 వందల సినిమాలలో గొప్ప పాత్రలు చేసిన నిర్మలమ్మ సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. పాత్ర ఏదైనా తన నటనతో సహజత్వాన్ని తీసుకువచ్చిన నటి. అప్పట్లో సినిమా ఏదైనా నిర్మలమ్మకు ఓ పాత్ర ఉండాల్సిందే.

నిర్మలమ్మ అంటే అందరికీ బాగా గుర్తొచ్చే పాత్రలు బామ్మ పాత్రలే. ఎన్ని సినిమాలలో నిర్మలమ్మ బామ్మ పాత్ర చేసినా దానికి బాగా పేరొచ్చింది. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్, మాయలోడు, స్నేహం కోసం లాంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి – నిర్మలమ్మ మధ్య వచ్చే సన్నివేశాలు ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. ఇక స్నేహం కోసం సినిమాలో చిరంజీవికి తల్లిగా, బామ్మగా అద్భుతంగా నటించారు. ఇందులో సెంటిమెంట్ పాత్రతో పాటు, మంచి కామెడీ రోల్ చేసి నవ్వించారు.. ఏడిపించారు. కొడుకు జైలు నుంచి వచ్చిన సందర్భంలో ఆమె పలికించిన హావా భావాలు అందరి మనసులో అలా నిలిచిపోయాయి.

చినరాయుడు సినిమాలో వెంకటేశ్ తల్లిగా నటించిన నిర్మలమ్మ ఎమోషనల్ సీన్స్‌లోనూ, అలాగే విజయశాంతితో కలిసి కనిపించిన కామెడీ సీన్స్‌లోనూ ఎంతగా ఆకట్టుకున్నారో తెలిసిందే. ఎగిరేపావురమా సినిమాలో జేడి చక్రవర్తి – లయ కి బామ్మగా నటించిన నిర్మలమ్మ ఇందులో చెవుడున్న పాత్రలో కనిపించి కడుపుబ్బా నవ్వించారు. ఆపద్భాంధవుడు, మాయలోడు, పండుగ, కిల్లర్, బావ బావమరిది, పేకాట పాపారావు, ఆలీబాబా అరడజను దొంగలు, శుభ సంకల్పం, మావి చిగురు, ఆహ్వానం, రాయుడు సీతారామరాజు, ప్రేమకు స్వాగతం..ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో అద్భుతమైన పాత్రల్లో కనిపించి తనదైన శైలి నటనతో ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు.

ఇప్పుడున్న నటీమణుల్లో నిర్మలమ్మ లాంటి గొప్ప నటిమణి భూతద్దం పెట్టి వెతికినా దొరకదు అని సందేహం లేకుండా చెప్పవచ్చు. ఆవిడ పోషించనటువంటి పాత్రలు మరెవరూ చేయలేదు. అందులోనూ సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే నిర్మలమ్మ అనే నటీమణిని మరొకరు రీప్లేస్ చేయలేరని ఖచ్చితంగా చెప్పవచ్చు. నాటి నుంచి ఆమె చివరి సినిమా వరకు సెట్‌లో ఉన్న సహ నటీ నటులతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ముఖ్యంగా ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ దగ్గర్నుంచి ఈ తరం హీరోలవరకు అందరితోనూ మంచి అనుబంధం ఉంది. అందుకే ఆమెను అందరూ నిర్మలమ్మ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago