Featured

Aacharya : ఆచార్యలో యంగ్ చిరు పాత్రకు మహేష్ కు ఉన్న లింకేంటో..!

Aacharya : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా స్టార్ చిరంజీవి తొలిసారి కలిసి నటించిన ఫుల్ లెన్త్ చిత్రం ఆచార్య. ఈ సినిమా మెగా అభిమానులకు ఒక పీడకల. ఈ సినిమా గురించి మొదట్లో కొరటాల, చిరు కాంబినేషన్ అనగానే బాగా అంచనాలు ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా పూర్తవడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టడం, కథలో మార్పులు, చిరుకి హీరోయిన్ లేకపోవడం వంటి విషయాలు సినిమాపై నెగెటివ్ ప్రభావాన్ని చూపాయి.

ఇక పాన్ ఇండియా సినిమా జమానాలో విడుదల అవ్వడం, సినిమా కథలో అనేక మార్పులు ఇవన్నీ కలిపి ఆచార్య సినిమాకు మరీ ఘోరంగా మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇక ఆచార్య సినిమా బయ్యర్స్ కి నష్టాలను మిగిల్చింది. కొరటాలకు మొదటి ఓటమిని అందించింది. ఇక ఈ సినిమా ఇపుడు ఓటీటీ లో విడుదలయి మళ్ళీ మెగా అభిమానులను బాధపెడుతోంది. ఇక ఈసినిమాలో కథానుసారం దళం లీడర్ సత్యదేవ్ చనిపోతూ తన కొడుకును యంగ్ ఆచార్యకి ఇస్తాడు. ఇక ఈ సన్నివేశం కోసం చిరంజీవిని యంగ్ ఏజ్ లో చూపించాల్సి వచ్చింది. ఇందుకోసం విఎఫ్ఎక్స్ ను వాడారు. ఈ విషయం మెగా అభిమానులకు మరింత కోపం తెప్పించింది.

ఇక విఎఫ్ఎక్స్ కు మహేష్ కి సంబంధం…..

ఈ సినిమాలో సిద్ధా పాత్రకోసం మొదట అనుకున్నది మహేష్ బాబుని. మహేష్ బాబుకి ఆ పాత్ర నచ్చలేదట కానీ కొరటాల పై ఉన్న అభిమానంతో నో చెప్పలేక పోయారట. ఇక రామ్ చరణ్ ను యంగ్ ఆచార్య పాత్రకు అనుకున్నారట. అది కాక మహేష్ కి 30 కోట్ల పారితోషకం కూడా ఆఫర్ చేశారట నిర్మాతలు. 15నిమిషాల నిడివి గళ పాత్రకోసం అంత పారితోషకం ఆఫర్ చేసినా మహేష్ నో చెప్పలేక సైలెంట్ అయ్యారట. అయితే ఈ గ్యాప్ లో చిరు, సిద్ధా పాత్రకోసం చరణ్ ను ప్రపోజ్ చేశారట. అంతే పారితోషకాన్ని ఫైనల్ చేసి పాత్ర నిడివిని పెంచాలని సూచించారట. ఇక సిద్ధా పాత్ర 15 నిమిషాల నుండి 45 నిమిషాలకి పెంచారు. ఇక యంగ్ చిరు పాత్ర కోసం విఎఫ్ఎక్స్ ను వాడారు. అది కాస్త వికటించింది. అయినా యంగ్ చిరు పాత్ర కోసం మెగా కాంపౌండ్ లోని హీరోల్లో ఎవరో ఒకరిని తీసుకుని ఉంటే సరిపోయేది కదా…

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago