Categories: FeaturedMovie News

Vijay Devarakonda: ఖుషి సినిమా షూటింగ్ లో ప్రమాదం.. ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసిన దర్శకుడు..!

Vijay Devarakonda : సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న సినిమా ఖుషి. కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మజిలీ సినిమా దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమా తొలి షెడ్యూల్ కాశ్మీర్ లోని పహాల్గంలో జరుగుతోంది. స్టంట్స్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో లిధార్ నది రెండు వైపులా కట్టిన తాడుపై వాహనం నడపాల్సి వచ్చింది. కానీ ఆ సమయంలో వాహనం కిందపడి సామ్, విజయ్ నీళ్లలో పడ్డారని దాంతో గాయాలయ్యాయని వార్త వినిపిస్తోంది. అయితే ఖుషి టీం నుండి ఎలాంటి సమాచారం లేదు.

ఆక్సిడెంట్ ఘటన ఫేక్ న్యూస్……

ఇక కాశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తయినట్లు డైరెక్టర్‌ శివనిర్వా‍ణ ట్విటర్‌లో షేర్ చేసుకున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఈ ఏడాది చివరన డిసెంబర్‌ 23 విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధం చేస్తోంది. ఇక ఈ యాక్సిడెంట్ విషయంలో చిత్ర యూనిట్ స్పందించింది. అది ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు. ఖుషి సినిమా షూటింగ్ లో విజయ్ దేవరకొండ, సమంతలకు ప్రమాదం జరిగినట్టు కొన్ని వెబ్ సైట్ లల్లో వార్తలు వినిపిస్తున్నాయి కానీ వాటిలో ఏమాత్రం వాస్తవం లేదు. ఖుషి టీం అంతా విజయవంతంగా కాశ్మీర్ లో 30 రోజుల షూటింగ్ పూర్తి చేసుకొని నిన్ననే హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇక ట్విట్టర్ ద్వారా దర్శకుడు శివ నిర్వాణ పోస్ట్ చేసి యాక్సిడెంట్ పై క్లారిటీ ఇచ్చారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago