Vijay Devarakonda : సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న సినిమా ఖుషి. కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మజిలీ సినిమా దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమా తొలి షెడ్యూల్ కాశ్మీర్ లోని పహాల్గంలో జరుగుతోంది. స్టంట్స్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో లిధార్ నది రెండు వైపులా కట్టిన తాడుపై వాహనం నడపాల్సి వచ్చింది. కానీ ఆ సమయంలో వాహనం కిందపడి సామ్, విజయ్ నీళ్లలో పడ్డారని దాంతో గాయాలయ్యాయని వార్త వినిపిస్తోంది. అయితే ఖుషి టీం నుండి ఎలాంటి సమాచారం లేదు.

ఆక్సిడెంట్ ఘటన ఫేక్ న్యూస్……
Fake news pic.twitter.com/dbneXS8h5s
— Shiva Nirvana (@ShivaNirvana) May 24, 2022
ఇక కాశ్మీర్ షెడ్యూల్ పూర్తయినట్లు డైరెక్టర్ శివనిర్వాణ ట్విటర్‌లో షేర్ చేసుకున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఈ ఏడాది చివరన డిసెంబర్ 23 విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధం చేస్తోంది. ఇక ఈ యాక్సిడెంట్ విషయంలో చిత్ర యూనిట్ స్పందించింది. అది ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు. ఖుషి సినిమా షూటింగ్ లో విజయ్ దేవరకొండ, సమంతలకు ప్రమాదం జరిగినట్టు కొన్ని వెబ్ సైట్ లల్లో వార్తలు వినిపిస్తున్నాయి కానీ వాటిలో ఏమాత్రం వాస్తవం లేదు. ఖుషి టీం అంతా విజయవంతంగా కాశ్మీర్ లో 30 రోజుల షూటింగ్ పూర్తి చేసుకొని నిన్ననే హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇక ట్విట్టర్ ద్వారా దర్శకుడు శివ నిర్వాణ పోస్ట్ చేసి యాక్సిడెంట్ పై క్లారిటీ ఇచ్చారు.
ఖుషి సినిమా షూటింగ్ లో విజయ్ దేవరకొండ, సమంత లకు గాయాలు అయినట్టు కొన్ని వెబ్ సైట్ లల్లో వార్తలు వస్తున్నాయి.అందులో ఎలాంటి వాస్తవం లేదు. టీం అంతా సక్సెస్ ఫుల్ గా కాశ్మీర్ లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని నిన్న నే హైదరాబాద్ తిరిగి వచ్చారు. #VijayDeverakonda @vennelakishore pic.twitter.com/2FtSjyXMJg
— Sreedhar Marati (@SreedharSri4u) May 24, 2022
































