Aadipurush : ‘బాహుబలి’ సినిమా తరువాత పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమా రికార్డులు, తన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమా తరువాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న అతి పెద్ద ప్రాజెక్ట్ ఆదిపురుష్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఆదిపురుష్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 2వ తేదిన ఫస్ట్ లుక్, టీజర్ అయోధ్య లో విడుదల చేయబోతున్నారు.
ప్రభాస్ నే రాముడిగా తీసుకోవడం వెనుక అంత కథ ఉందా…
ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా, క్రితి సనన్ సీత పాత్రలో కనిపించునున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోలను పక్కన పెట్టి దర్శకుడు ఓంరౌత్ రాముడిగా ప్రభాస్ ను తీసుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ లో ఉన్న కొన్ని లక్షణాల కారణంగానే ఈ అవకాశం తనకు వచ్చిందని అందరూ అనుకుంటున్నారు.
విభిన్నమైన పాత్రలలో నటించాలి అనుకోవడం, సినిమా అంటే ప్రాణం పెట్టడం ఒక కారణం అయితే, బాహుబలి సినిమా సమయంలో తనకు ఎన్ని అవకాశాలు వచ్చినా సున్నితంగా వద్దని చెప్పి పని పట్ల తన అంకిత భావాన్ని కనపరచడం మరో కారణం. తాను ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ తన కోసం వచ్చే అభిమానులను ఆప్యాయంగా పలకరించడం వారి గురించి ఆలోచించడంతో పాటు ఒక సినిమా ఒప్పుకున్నాక అది ఎంత ఆలస్యం అయినా అది పూర్తి అయ్యేవరకు ఓపికగా ఎదురు చూడటం ప్రభాస్ లో ఉన్న మరో ముఖ్య లక్షణం. అందుకే బాలీవుడ్ దిగ్గజాలను సైతం పక్కన పెట్టి ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కు వచ్చింది అని అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…