Featured

Nandamuri Balakrishna : ఎమ్మెల్యే బాలకృష్ణపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన హిజ్రాలు… హిందూపూరులో వేడెక్కిన రాజకీయం..!

Nandamuri Balakrishna : ఇటీవల జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జరిగిన సంఘటనల గురించి తెలిసిందే. ఈ సంఘటనపై నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. సిగ్గులేని బతుకులు అంటూ తన ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చడానికి తీసేయడానికి ఎన్టీఆర్ అనేది పేరు కాదు, అది ఒక సంస్కృతి, నాగరికత ఎన్టీఆర్ తెలుగుజాతి వెన్నుముక అని ఆయన భావొద్వేగంతో మాట్లాడారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు పీతలున్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి అంటూ బాలకృష్ణ మండిపడ్డారు. శునకాలముందు తలవంచకు తిరిగే సిగ్గులేని బతుకులు అంటూ బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

బాలకృష్ణపై హిజ్రాల ఫిర్యాదు…

యూనివర్సిటీ పేరు విషయంలో వైస్సార్సీపీ పై విరుచుకుపడిన బాలకృష్ణ మీద వైస్సార్సీపీ నాయకులు, మంత్రులు కూడా చురకలు అంటించారు. ఇది ఇలా ఉండగా తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై పోలీస్ స్టేషన్లో హిజ్రాలు ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. మా సమస్యలు చెప్పుకోవాలి అంటే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడంలేదని అని కొంతమంది హిజ్రాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

హిందూపూర్ లో ఎమ్మెల్యే గా విధులు నిర్వహించాల్సిన బాలయ్య ఇక్కడ ఉండటం లేదని వెంటనే ఇక్కడి సమస్యలను పట్టించుకోవాలని కోరుతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఉన్న ఇక్బాల్ కు చెందిన వర్గం నేతలు జగన్ దృష్టిలో పడాలన్న తాపత్రయంతో బాలకృష్ణ పై కావాలని హిజ్రాలతో ఫిర్యాదు చేయించారని టిడిపి నేతలు మండి పడుతున్నారు. బాలకృష్ణ నియోజక వర్గంలో ఉన్నా లేకపోయినా అక్కడి అభివృద్ధి, సమస్యల గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటారు అని తెలియజేసారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago