Aamir Khan Rejects ₹120 Cr OTT Deal, Will Decide on Digital Release in 2 Months
సినీ పరిశ్రమలో ఓటీటీ ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న ఈ రోజుల్లో, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మాత్రం ప్రేక్షకుల అనుభూతిని మొదటి ప్రాధాన్యంగా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, తన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 120 కోట్ల భారీ డీల్ను ఆఫర్ చేసినా, అమీర్ ఖాన్ స్పష్టంగా తిరస్కరించారని వార్తలు చెబుతున్నాయి.
ఇటీవల సినిమాలు థియేటర్లకు వచ్చి వారం-పదిరోజుల్లోనే ఓటీటీలో విడుదలవుతున్న పరిస్థితి అందరికి తెలిసినదే. ఈ పరిణామం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ పాజిట్‌ని మార్చాలన్న ఆలోచనతోనే అమీర్ ఖాన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమీర్ ఈ నిర్ణయం ద్వారా ఒక క్లియర్ మెసేజ్ ఇస్తున్నాడు
“సినిమా అనేది ఓ కళ, దాన్ని బిగ్ స్క్రీన్‌పై చూసే అనుభూతికే ప్రాముఖ్యత ఇవ్వాలి.”
అంటే, ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు రావాలంటే, ఓటీటీపై డిపెండెంట్ కాకుండా సినిమాను పూర్తి పరిపక్వతతో థియేటర్ అనుభూతికి తీసుకురావాలన్నది అమీర్ ఆలోచన.
2007లో విడుదలైన మరియు విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని సాధించిన ‘తారే జమీన్ పర్’ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కినట్టు సమాచారం. అమీర్ ఖాన్, జెనీలియా డిసౌజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది.
ప్రస్తుతం ఈ డీల్ గురించి అమీర్ ఖాన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఆయన గత సినిమాల దృష్ట్యా, కమర్షియల్ పరంగా కంటే కంటెంట్, ప్రేక్షక అనుభవంకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా చర్చల్లో ఉన్నారు.
సినిమా అనుభూతిని థియేటర్లకే పరిమితం చేయాలన్న అమీర్ ఖాన్ ప్రయత్నం ప్రస్తుతం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ప్రేక్షకులు ఎలాంటి స్పందన ఇస్తారో, సినిమా విడుదల తర్వాత తెలియనుంది. కానీ, ఓటీటీ డామినేషన్‌ను తలకిందులు చేసేలా అమీర్ తీసుకున్న ఈ నిర్ణయం, చాలామందికి స్ఫూర్తిగా నిలవొచ్చు.
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…
హనుమంతుడిని భక్తితో ఆరాధిస్తే కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయని హిందూ సంప్రదాయంలో విశ్వాసం ఉంది. అందుకే ప్రతి మంగళవారం, శనివారం…
తెలుగు సినీ పరిశ్రమలో హీరో-హీరోయిన్ల మధ్య వయస్సు తేడా గురించి చర్చలు కొత్తవి కావు. అయితే కొందరు నటులు మాత్రం…
రోజువారీ పనుల్లో చురుకుదనం కోసం సరైన ఆహారం ఎంత ముఖ్యమో ఆరోగ్య నిపుణులు తరచూ గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో హృదయాన్ని కలచివేసే ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో కుమారుడు తన సొంత తల్లిని అమానుషంగా…
హ్యాపీ డేస్ సినిమాతో యువత హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన “టైసన్” పాత్ర ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది.…