Actor Rana: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందిన దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందిన రానా హీరోగా మాత్రమే కాకుండా ప్రతినాయకుడిగా కూడా నటించి గుర్తింపు పొందాడు. ఇక ఇటీవల విడుదలైన భిమ్లా నాయక్ సినిమాలో పవర్ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు.
ఆ తర్వాత విరాటపర్వం సినిమాలో వైవిద్యమైన పాత్రలో నటించి మరొక హిట్ అందుకున్నాడు.
ఇక అప్పటి నుండి సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇక ఇటీవల రానా నాయుడు వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన ఆ వెబ్ సిరిస్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2 లో నటించేందుకు రానా సిద్ధం అవుతున్నాడు.
ప్రస్తుతం ఆయన మంచి చిల్లింగ్ మూడ్ లో ఉన్నాడు.ఈ క్రమంలో యూట్యూబ్ లో పాపులర్ షో గా ప్రసిద్ధి గాంచిన ‘మై విలేజ్’ ప్రోగ్రాం లో రానా సందడి చేశారు.
దీంతో పల్లెటూరు వాతావరణం లోకి అడుగుపెట్టిన రానాకి గంగవ్వ అదిరిపోయే దావత్ ఇచ్చింది. గంగవ్వ చేతుల మీదగా తాటి కల్లు తాగిన రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
పరేషాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా యూనిట్ తో కలిసి రానా మై విలేజ్ షో లో సందడి చేశారు. ఈ క్రమంలో మై విలేజ్ షో టీం తో కలిసి దావత్ చేసుకున్నారు. ఈ క్రమంలో తాటి కల్లు తాగి, తాటి నుంజులు తింటూ సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక వీడియో గంగవ్వా సెంటారాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…