Featured

Actor Sampath Raj : 23 ఏళ్లకే పెళ్లి… విడాకులు తీసుకోడానికి కారణం అదే… కూతురు ఏమి చేస్తుందంటే…: నటుడు సంపత్ రాజ్

Actor Sampath Raj : మిర్చి సినిమాలో విలన్ గా ఒక్కసారిగా లైంలైట్ లొకి వచ్చిన విలన్ సంపత్ రాజ్. ఆ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్న సంపత్ రాజ్ ఆ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో పెద్ధ సినిమాల్లో విలన్ గా నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక తాజాగా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న సంపత్ రాజ్ గారు రీసెంట్ గా జీ ఓటిటి కోసం నటించిన ‘వ్యవస్థ’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రొమోషనల్ కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

నా కూతురే నా ప్రపంచం…

23 ఏళ్లకే పెళ్లి చేసుకున్న తాను పాప పుట్టాక కలిసి ఉండలేమని నిర్ణయించుకుని విడిపోయామని తెలిపారు. పాప తన వద్దే ఉండాలని కస్టడీ తీసుకుని పెంచిన ఆయన తన కూతురు ఒప్పుకోకపోతే తాను నటుడిని అయ్యేవాడిని కాదు అంటూ తెలిపారు. తన కూతురు నేను విడాకులు తీసుకునే సమయానికి చిన్న పాప అదే సమయంలో తనకు సినిమాలో అవకాశం రావడంతో ఏమి చేయాలో తెలియని సమయంలో తనతో మాట్లాడి బోర్డింగ్ స్కూల్ లో నువ్వు ఐదేళ్ళు ఉంటే నేను నటుడుగా నిలాదొక్కుకుంటాను ఆ తరువాత నిన్ను బయటికి తీసుకుని వస్తాను నీ ఐదేళ్ళు నాకోసం ఇస్తావా అని అడిగితే తనకు అంత చిన్న వయసులో ఏమర్థమైందో తెలియదు కానీ బోర్డింగ్ స్కూల్ కి వెళ్లింది.

తన పదో తరగతి వరకూ అక్కడే ఉండి ఆపైన నా దగ్గరికి వచ్చింది. నా భార్యతో విడాకులు తీసుకున్నాను, ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటాను. మా అభిప్రాయాలు వేరవడం వల్ల విడిపోయాను కానీ స్నేహితులుగా ఉన్నాం. నా బిడ్డ తన తల్లితో టచ్ లోనే ఉంది. ప్రస్తుతం నా కూతురు మెలబోర్న్ లో ఉద్యోగం చేస్తోంది అంటూ తనకు సినిమాల మీద ఆసక్తి లేదని తెలిపిన ఆయన సమాజ సేవ మీద ఎక్కువ ఆసక్తి ఉందని, ఒక ఓల్డ్ఏజ్ హోమ్ కోసం తాను పనిచేస్తోందని తెలిపారు.

Bhargavi

Recent Posts

ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షాలు..మరో 4 రోజులు కుండపోతకు రెడ్ అలర్ట్!

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…

2 minutes ago

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి దొంగల కలకలం..వెంటాడిన రైల్వే పోలీసులు..

అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…

11 minutes ago

విద్యార్థులకు బూట్లకు బదులు చెప్పులా? కర్ణాటక ప్రభుత్వం కొత్త ఆలోచన..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…

24 minutes ago

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago