దాసరి నారాయణ రావు.. ఈ పేరు చెబితే ఇండస్ట్రీలో అదో గౌరవం. పెద్దాయనగా.. తలలో నాలుకగా.. చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా, దర్శకులకు బాసటగా.. నటులకు నారాయణ మంత్రంగా నిలిచిన మహోన్నత వ్యక్తి. అంతే కాదు మేస్త్రీగా రాజకీయాల్లోకెళ్లి ఇస్త్రీ చేసిన దర్శక నట దిగ్గజం దాసరి నారాయణ రావు. దాసరి అనేది పేరు కాదు…ఒక బ్రాండ్ గా తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటూ పేజీలు ఏర్పాటు చేసుకున్న అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు.
అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించారు. ఎంతో మంది సినీ హీరోలను, హీరోయిన్లను, ఆర్టిస్టులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసి.. మంచి బంగారు భవిష్యత్తును ఇచ్చిన మహోన్నత వ్యక్తి. ఒక డైరెక్టర్ గా, నిర్మాతగా, యాక్టర్ గా , గాయకుడిగా ఎన్నో సనిమాలను తీశారు.. నటించారు. అబ్బో ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా అతడు సినిమాలకు పరిచయం చేసిన వారిలో ఓ వ్యక్తి రూ.100 కోట్లు దాసరి వల్ల నష్టపోయాడట.. ఎవరా వ్యక్తి.. ఇది నిజమేనా.. ఆ విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
1995 సంవత్సరంలో ‘ఒరేయ్ రిక్షా’ సినిమా దాసరి దర్వకత్వంలో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దాసరి నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని.. యాక్టింగ్ లో కూడా ఎంతో ప్రతిభ ఉన్న వారిగా అందరికీ తెలిసింది. అయితే జయప్రకాశ్ రెడ్డి.. దాసరికి మంచి స్నేహితుడు. ఆయన ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాలను చెప్పారు. అప్పట్లో జేపీ రెడ్డి సినిమాలోకి రాకముందు దాసరి నారాయణ బలవంతగా వచ్చేట్టు చేశారట.
అప్పుడు అతడు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అప్పుడు అతడికి ఓ ప్రాజెక్టు వచ్చింది. దానిని చేస్తున్న సమయంలో దాసరి బలవంతం చేయడంతో ఇండస్ట్రీకి వచ్చారు. దీంతో ఆ ప్రాజెక్టు వదిలి పెట్టి రావాల్సి వచ్చిందని.. ఆ ప్రాజెక్టు విజయవంతగా పూర్తి చేసిన వారికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అతడు చెప్పుకొచ్చాడు. ఇలా దాసరి వల్ల తాను వంద కోట్ల రూపాయాలు నష్టపోయానని నవ్వుకుంటూ చెప్పారు జయప్రకాశ్ రెడ్డి.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…