Movie News

Actress Pavitra Lokesh: మాజీ భర్తని పొగడ్తలతో ముంచెత్తిన పవిత్రా లోకేశ్.. వైరల్ అవుతున్న కామెంట్స్..?

Actress Pavitra Lokesh: ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో అక్కా, అత్త, తల్లి వంటి పాత్రలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న పవిత్ర లోకేష్ కొంతకాలంగా నటుడు వి కే నరేష్ తో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపించడంతో తొందర్లోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ప్రస్తుతం వీరి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

న్యూ ఇయర్ సందర్భంగా ఒక లిప్ లాక్ వీడియో షేర్ చేస్తూ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి స్పందిస్తూ పవిత్ర లోకేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఇద్దరి పెళ్లి జరగనివ్వనని సవాల్ చేసింది. అయితే పవిత్ర, నరేష్ పెళ్లి జరిగే అవకాశాలు లేవని కొంతమంది ప్రమాదం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన నరేష్ పవిత్రని నాలుగవ పెళ్లి చేసుకుంటాడని గ్యారెంటీ లేదు. అంతేకాకుండా గతంలో రమ్య రఘుపతిని వివాహం చేసుకున్నప్పుడు నరేష్ ఆమె గురించి చాలా గొప్పగా చెప్పాడు.

ఇప్పుడు పవిత్రతో పెళ్లికి రమ్య అడ్డుపడటంతో ప్రెస్ మీట్ ఆమె గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. అంతే కాకుండా పవిత్ర మాటలపై కూడా ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో తన భర్త గురించి ఎంతో గొప్పగా పొగిడిన పవిత్ర ఇప్పుడు అతనికి విడాకులు ఇచ్చి నరేశ్ ని వివాహం చేసుకోవటానికి సిద్దమైంది.

Actress Pavitra Lokesh: సుచేంద్ర ఎంతో గొప్పవాడు….

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర తన భర్త సుచేంద్ర ప్రసాద్‌ గురించి మాట్లాడుతూ…’ సీరియల్‌లో కలిసి నటించినప్పుడు మా మధ్య ఏర్పడిన బంధం స్నేహమో, ప్రేమో, గౌరవమో తెలియదు గానీ.. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానంతో పెళ్లి చేసుకున్నాం. సుచేంద్ర ప్రసాద్ నాకన్నా చాలా గొప్ప వ్యక్తి నాతో కంపేర్ చేసుకుంటే ఆయనలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఆయనకు నేనంటే చాలా అభిమానం. నా అభిప్రాయాలను కూడా ఎంతో గౌరవిస్తారు. ఇప్పటి వరకు ఆయనలో ఒక్క లోపాన్ని కూడా చూడలేదు. నా విషయంలో ఆయన చాలా పొసేసివ్‌, నేను ఆయనకే సొంతమని భావిస్తారు. అందుకే, నా సినిమాలు కూడా చూసేవారు కాదు. ఇలా మాజీ భర్త గురించి చెబుతూ పొగడ్తలతో ముంచేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago