Poonam Kaur: సినిమాల కన్నా వివాదాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూనమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ బాగా పాపులారిటీ దక్కించుకున్నారు. తాజగా పూనమ్ కౌర్ లీడ్ రోల్ లో “నాతిచరామి” అనే సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపద్యంలో ఒక యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూనమ్ కౌర్ ఎమోషనల్ అయ్యారు.
పూనమ్ మట్లాడుతూ తనకు నిజజీవితంలో కలిసిన చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు “పూనమ్ నువ్వు ఇండస్ట్రీకి సెట్ కావు.. నువ్వు సూట్ అవ్వవు.. చాలా బోరింగ్ ” అని అనేక రకాలుగా మాట్లాడేవారట.. ఆ డైరెక్టర్స్ పేర్లు మాత్రం చెప్పలేదు.. కానీ నేను అవేమి పట్టించుకోకుండా నిజాయితీగా పని చేసాను అందుకే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నాను.. చాలా మంది అమ్మాయిలు ఒక్క సినిమా రెండు సినిమాలు చేసి వెళ్ళిపోతారు. కానీ నేను ఇప్పటివరకూ ఏ పెద్ద హీరోతో సినిమా చేయలేదు. అయినా కూడా ఈరోజుకీ డైరెక్టర్లు నా ఇంటికి వచ్చి కథలు చెబుతారు. ఒక దురబలమైన అమ్మాయిని తోక్కేయడం, మిస్ యూజ్ చేయడం చాలా సింపుల్. నేను చాలా స్ట్రాంగ్ అందుకే వాటి నుంచి బయట పడ్డాను.
కొందరు వ్యక్తులు రాజకీయాల కోసం తన జీవితాన్ని నాశనం చేసారని, గత మూడేళ్ళుగా వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగా ఏంతో నష్టాన్ని అనుభవించానని తెలిపింది. అయితే పలు పెద్ద చిత్రాల్లో అవకాశాలు వచ్చినా కొందరు రావణులు చెడగొట్టారని పూనమ్ విమర్శించింది. అయినా సరే వెనకడుగు వేయకుండా సీత, ద్రౌపదిల స్పూర్తితో పనిచేస్తానని పేర్కొంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…